వంశీని మించిన పెద్ద క్రిటిక్ ఉండరు: దర్శకుడు భాను
రవితేజ అభిమానిగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పిన భాను, వేదికపై ముఖ్య అతిథి హీరో సూర్య నటించిన సినిమాలను ఇష్టపడతానని తెలిపారు.
By: Sivaji Kontham | 28 Oct 2025 11:10 PM ISTమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన సినిమా `మాస్ జాతర`. రైల్వే కాప్ పాత్రలో రవితేజను కొత్తగా చూపించానని దర్శకుడు భాను భోగవరపు వెల్లడించారు. మాస్ జాతర ఈ నెల 31న ప్రతిష్ఠాత్మకంగా విడుదలవుతోంది. ఈ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్రబృందం పాల్గొంది.
ప్రీరిలీజ్ వేడుకలో తన నిర్మాత నాగవంశీ విమర్శనాత్మక దృష్టిపై రచయిత- దర్శకుడు భాను భోగవరపు ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ లో ప్రముఖ వెబ్ సైట్లకు ధీటుగా వంశీ సినిమాలను సమీక్షిస్తారని, ఆయన క్రిటిసిజాన్ని దాటుకుని వచ్చింది అంటే అది సూపర్‌హిట్ సినిమా అని అన్నారు. ``నా దృష్టిలో నాగవంశీ కంటే గొప్ప క్రిటిక్ లేరు. ఆయనకు సినిమా నచ్చిందంటే అది హిట్టే. వంశీ గారు ఈ సినిమా ద్వితీయార్థం చూసి చాలా బాగుంది అన్నారు. ప్రథమార్థం కూడా ఆకట్టుకుంటుంది. అక్టోబర్ 31 కోసం మీ అందరిలాగే నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
రవితేజ అభిమానిగా నేను ఇక్కడికి వచ్చానని చెప్పిన భాను, వేదికపై ముఖ్య అతిథి హీరో సూర్య నటించిన సినిమాలను ఇష్టపడతానని తెలిపారు. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. రవితేజ గారు దర్శకులను పరిచయం చేసే ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో సీట్ ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతానని ఆశిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఒకే ఒక అర్హత నా కథ. ఆ కథ నచ్చి రవితేజ గారు నాకు అవకాశమిచ్చారు. నన్ను నమ్మి ఎంతో ప్రోత్సహించారు. సితార సంస్థలో మొదటి సినిమా చేసే అవకాశం వచ్చేలా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్ కి నేను అభిమానిని. ఇందులో ఆయన పాత్ర సర్ ప్రైజ్ చేస్తుంది. ఇందులో తులసి అనే పాత్ర శ్రీలీల గారు పోషించారు. ఆమెలో ఉన్న మాస్ కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ట్రైలర్ విడుదలయ్యాక నవీన్ చంద్ర గారి పాత్ర లుక్ గురించి, నటన గురించి అందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. దర్శకుడిగా ఇది నాకు మొదటి సినిమా అయినప్పటికీ, భీమ్స్ గారు ఎంతో అండగా నిలిచారు. అద్భుతమైన సంగీతం అందించారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇచ్చిన మద్దతుని ఎప్పటికీ మరిచిపోలేను`` అని అన్నారు.
ప్రీరిలీజ్ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ రవితేజ ఎంతో ఎనర్జిటిక్ స్టార్ అని అన్నారు. దర్శకులు శివ నిర్వాణ, రామ్ అబ్బరాజు, ఛాయాగ్రాహకుడు విధు అయ్యన్న, కళా దర్శకుడు శ్రీ నాగేంద్ర తంగాల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
