'లూజర్' డైరెక్టర్ 'బైకర్'.. అసలు ప్లాన్ వేరే ఉందా?
ఈ సినిమాకు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర. ఇతను ఎవరో కాదు, లూజర్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న డైరెక్టరే. 'లూజర్' సిరీస్‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా, దాని అసలు బలం ఎమోషన్.
By: M Prashanth | 1 Nov 2025 10:42 PM ISTశర్వానంద్ చాలా కాలం తర్వాత 'బైకర్' అంటూ ఒక ఫుల్ యాక్షన్ మోడ్‌లోకి దిగుతున్నాడు. డిసెంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా గ్లింప్స్ చూస్తే, విజువల్స్, శర్వానంద్ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా కొత్తగా, ఇంటెన్స్‌గా ఉన్నాయి. తెలుగు సినిమాకు 'డర్ట్ బైక్ రేసింగ్' లాంటి కొత్త జానర్‌ను పరిచయం చేస్తూ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ సినిమాకు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర. ఇతను ఎవరో కాదు, లూజర్ వెబ్ సిరీస్‌తో ఆకట్టుకున్న డైరెక్టరే. 'లూజర్' సిరీస్‌లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఉన్నా, దాని అసలు బలం ఎమోషన్. క్యారెక్టర్ల మధ్య సంఘర్షణ, గెలుపు కోసం వాళ్లు పడే ఆరాటాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించి మెప్పించాడు. ఇప్పుడు అదే డైరెక్టర్, అంతకంటే స్టైలిష్‌గా, హై ఆక్టేన్‌గా ఉండే 'బైకర్' సబ్జెక్ట్‌ను ఎలా డీల్ చేశాడన్నదే ఆసక్తికరం.
ఈ ఆసక్తిని మరింత పెంచుతూ, అభిలాష్ ఈ మధ్య ఒక కామెంట్ చేశాడు. "మీరు రీసెంట్‌గా చూసిన రేసింగ్ సినిమాల కంటే 'బైకర్' 1% ఎక్కువ ఎగ్జైట్ చేస్తుంది" అని గట్టి స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతను ఏ సినిమా పేరునూ డైరెక్ట్‌గా చెప్పకపోయినా, జనాలు మాత్రం దాన్ని ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ అయిన హాలీవుడ్ మూవీ 'F1'తో పోల్చడం మొదలుపెట్టారు.
అయితే, ఈ పోలికలోనే ఒక యూనిక్ పాయింట్ దాగి ఉంది. బ్రాడ్ పిట్ F1 సినిమా టెక్నికల్‌గా, విజువల్‌గా ఒక అద్భుతం. అలాంటి భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాతో, మన మోస్తరు బడ్జెట్ తెలుగు సినిమాను పోల్చడం రిస్కే. కానీ, అభిలాష్ ఉద్దేశం విజువల్స్ గురించి కాకపోవచ్చు. 'F1' అనేది రేసింగ్ థ్రిల్ గురించి అయితే, బైకర్.. "చావుకు ఎదురెళ్లే మొండోళ్ల కథ", "చివరి దాకా పోరాడటం గొప్ప" అనే ఎమోషనల్ డ్రామా గురించి కావచ్చు.
'లూజర్' సిరీస్‌లో అభిలాష్ బలం ఎమోషన్. బహుశా ఆ '1% ఎక్కువ ఎగ్జైట్‌మెంట్' అనేది విజువల్స్‌లో కాదు, కథనంలో, క్యారెక్టర్ల ఎమోషన్‌లో ఉండొచ్చు. ఒకవేళ అదే నిజమైతే, ఇది చాలా స్మార్ట్ మూవ్. 'బైకర్' టీజర్ టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గానే ఉంది. ఇప్పుడు దానికి 'లూజర్' రేంజ్ ఎమోషనల్ డెప్త్ కూడా తోడైతే, అభిలాష్ చెప్పినట్లు ఆడియెన్స్ నిజంగానే ఆ "1% ఎక్కువ" థ్రిల్‌ను ఫీల్ అవ్వొచ్చు. ఆ మ్యాజిక్ జరగాలంటే డిసెంబర్ 6 వరకు ఆగాలి.
