హీరో ఛాతి చూసి బాబోయ్ అనేసిందా!
రొమాంటిక్ సన్నివేశాలు..ఇంటిమేట్ సన్నివేశాలు తీయడంలో మిగతా పరిశ్రమలకు స్పూర్తి ఏ చిత్ర పరిశ్రమ అంటే ఎలాంటి సందేహం లేకుండా బాలీవుడ్ పేరు చెబుతారంతా.
By: Srikanth Kontham | 25 Sept 2025 9:00 PM ISTరొమాంటిక్ సన్నివేశాలు..ఇంటిమేట్ సన్నివేశాలు తీయడంలో మిగతా పరిశ్రమలకు స్పూర్తి ఏ చిత్ర పరిశ్రమ అంటే ఎలాంటి సందేహం లేకుండా బాలీవుడ్ పేరు చెబుతారంతా. బాలీవుడ్ లో ఆ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. అక్కడ నుంచే మిగతా పరిశ్రమలకు అలవాటైంది. బాలీవుడ్ మేకింగ్ చూసే? సౌత్ ఇండస్ట్రీ కూడా చాలా విషయాలు తెలు సుకుంది అన్నది కాదనలేని నిజం. లిప్ లాక్ సన్నివేశాలు..బెడ్ రూమ్ సన్నివేశాలు..ఇంటిమేట్ సీన్స్ ఇలాంటి వాటికి స్పూర్తి బాలీవుడ్ స్పూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రకమైన సన్నివేశాలిప్పుడు అన్ని పరిశ్రమల్లోనూ సహజంగా మారిపోయాయి.
అయితే ఒకప్పుడు ఇలాంటి సన్నివేశాలుంటే? అదో ప్రత్యేకమైన సినిమాగా మాట్లాడుకునేవారు. బాలీవుడ్ దేశ వ్యాప్తంగా పాపులర్ అవ్వడానికి కారణం ఇలాంటి సన్నివేశాలే. కాల క్రమంలో బాలీవుడ్ వీటిలో మరింత అప్ డేట్ అవుతూ వచ్చింది. బాలీవుడ్ లో `జన్బా జ్` సినిమాతో డింపుల్ కపాడియా కూడా అలాంటి సన్నివేశంలో నటించి అప్పట్లో అంతే ఫేమస్ అయింది. ఈ సినిమాలో అనీల్ కపూర్ కు జోడీగా నటించింది. ఫిరాజ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1988లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి.
ఈ సినిమాలో ఓ షాట్ కోసం ఫామ్ హౌస్ ను ఎంచుకున్నారు. ఆ సీన్ లో హీరో-హీరోయిన్ ఇద్దరు క్లోజ్ షాట్ లో కనిపించాలి. విషయం ఇద్దరికీ ముందే చెప్పారు. సరిగ్గా సీన్ చేసే సమయంలో అనీల్ కపూర్ షర్ట్ విప్పాడు. దీంతో డింపుల్ కపాడియా అతడి ఛాతి చూసి షాక్ అయింది. ఛాతి నిండా రోమాలు ఉండటంతో ఇతనేంటి ఇలా ఉన్నాడేంటి అనుకుంది. దీంతో ఆ ఛాతి సన్నివేశంలో నటించనని డింపుల్ కపాడియా మొండికేసింది.
అనీల్ తో అలాంటి షర్ట్ లేని సన్నివేశంలో తాను నటించలేననని..ఆ సీన్ తీసేయండని అడిగిందిట. కానీ దర్శ కుడు ఆ సీన్ ఉండాలని పట్టుబట్టినా నో చెప్పిందిట. దీంతో చివరకు డింపుల్ కపాడియాను ఫిరోజ్ ఖాన్ బ్రతి మలాడి చేయించుకున్నాడుట. పాత తరం హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాలకు అంత సులభంగా అంగీకరించేవారు కాదు. దీంతో కొంత మంది దర్శకులు హీరోయిన్లతో రాజీకి వచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితికి భిన్నమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
