తెలుగమ్మాయిని ఆదుకునేది ఆ ఒక్కటే
ఇలియానా టాలీవుడ్ నుంచి వెళ్లిపోయాక, ఆ లోటును ఇంకెవరూ భర్తీ చేయలేకపోయిన మాట వాస్తవం.
By: Sivaji Kontham | 6 Dec 2025 9:47 AM ISTఇలియానా టాలీవుడ్ నుంచి వెళ్లిపోయాక, ఆ లోటును ఇంకెవరూ భర్తీ చేయలేకపోయిన మాట వాస్తవం. అయితే కొన్నేళ్లకు డింపుల్ హయాతి అందచందాలు, నడుము సొగసు చూసాక, ఇలియానాకు రీప్లేస్ మెంట్ అంటూ అభిమానులు చాలా మురిసిపోయారు. తీరైన టోన్డ్ లుక్, సన్నజాజి నడుము సొగసు, చురుకైన చూపులతో ఇలియానాను తలపించింది డింపుల్.
అందుకు తగ్గట్టే ఈ తెలుగమ్మాయికి పెద్ద హీరోతో అవకాశాలు దక్కాయి. మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో నటించిన డింపుల్ ఇప్పుడు మరోసారి అతడితో జాక్ పాట్ అందుకుంది. ఇటీవల `భర్త మహాశయులకు విజ్ఞప్తి` అనే చిత్రంలో రవితేజ సరసన మరోసారి ఛాన్స్ దక్కించుకుంది. డింపుల్ కు ఈ చిత్రంలో నటనకు ఆస్కారం ఉన్న పాత్ర లభించిందని కథనాలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో డింపుల్ తనను తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు నిరంతరం సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లో ఉంది.
రెండేళ్ల గ్యాప్ తర్వాత డింపుల్ కి కోరుకున్న ఆఫర్ వచ్చింది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు తహతహలాడుతోంది. తన లుక్ పరంగా, నటన పరంగా వైవిధ్యం చూపించేందుకు, పర్ఫెక్షన్ కోసం పాకులాడుతోంది డింపుల్. తాజాగా సోషల్ మీడియాల్లో షేర్ చేసిన జిమ్ సెషన్స్ కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఈ లుక్ చూడగానే మళ్లీ ఇలియానా గుర్తుకు వచ్చింది! అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
2023 లో `రామబాణం` చిత్రంలో నటించిన డింపుల్ హయాతి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బిగ్ బ్రేక్ కోసం వేచి చూస్తోంది. ఈసారి కచ్చితంగా సక్సెస్ తో మ్యాజిక్ చేయాలని తపన పడుతోంది. అధిక బరువు, పిసివోడి లాంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న డింపుల్ ఫిట్ నెస్ కోసం తపించిన తీరు ఆసక్తికరం. కేవలం నెలల్లో చాలా బరువు తగ్గానని, దీనికోసం చాలా శ్రమించానని ఇంతకుముందు జిమ్ నుంచి కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. అవన్నీ వైరల్ అయ్యాయి. డింపుల్ హార్డ్ వర్క్ ఫలించాలని ఆకాంక్షిద్దాం. ఒక్క విజయం మరో నాలుగు సినిమాల్లో అవకాశాలు కల్పిస్తుంది. అలాంటి సక్సెస్ డింపుల్ కి దక్కాలని ఆకాంక్షిద్దాం..
