పట్టుచీరలో గ్లామర్ షో.. డింపుల్ హయాతి ఫోటోలు హాట్ టాపిక్
టాలీవుడ్ అందాల భామ డింపుల్ హయాతి తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్లామరస్ డ్రెస్సుల్లోనే కాకుండా, ట్రెడిషనల్ లుక్‌లోనూ తను ఎంత అందంగా ఉంటుందో ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి.
By: Madhu Reddy | 20 April 2026 5:40 PM ISTటాలీవుడ్ అందాల భామ డింపుల్ హయాతి తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. గ్లామరస్ డ్రెస్సుల్లోనే కాకుండా, ట్రెడిషనల్ లుక్‌లోనూ తను ఎంత అందంగా ఉంటుందో ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి. గ్రీన్ కలర్ పట్టుచీరలో, హెవీ జ్యువెలరీతో మెరిసిపోతున్న ఈ విజయవాడ చిన్నది, తన కాన్ఫిడెంట్ చూపులతో కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫోటోలే హాట్ టాపిక్‌గా మారాయి.ఆ విశేషాలు చూద్దాం..
పట్టుచీరలో పండంటి చందమామలా డింపుల్:
సాధారణంగా డింపుల్ హయాతిని మనం మోడరన్ అవుట్‌ఫిట్స్‌లో, గ్లామరస్ రోల్స్‌లో చూస్తుంటాం. కానీ తాజాగా ఈ బ్యూటీ గ్రీన్ కలర్ పట్టుచీర కట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. చీరకట్టులో తెలుగు ఆడపిల్లలా కనిపిస్తూనే, తనదైన శైలిలో గ్లామర్ టచ్ ఇచ్చింది. మెడలో ధరించిన భారీ కుందన్ నెక్లెస్ ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసింది. సంప్రదాయానికి, స్టైల్‌కు పర్ఫెక్ట్ కాంబినేషన్ లా ఉన్న ఈ లుక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జర్ర జర్ర భామ.. ఇప్పుడు గ్లామర్ కు చిరునామా:
వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర' పాటతో ఒక్కసారిగా పాపులర్ అయిన డింపుల్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రవితేజ సరసన 'ఖిలాడీ', గోపీచంద్ తో 'రామబాణం' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో రవి తేజ సరసన నటించి మంచి సక్సెస్ అందుకుంది. కేవలం వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. తాజాగా షేర్ చేసిన ఈ పట్టుచీర ఫోటోలు ఆమె క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
మన తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో రాణించడం కొంచెం కష్టమైన విషయమే అయినా, డింపుల్ తన టాలెంట్‌తో నిలదొక్కుకుంటోంది. విజయవాడలో పుట్టి పెరిగిన ఈ భామ, అటు నటనలోనూ ఇటు డ్యాన్స్‌లోనూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆమెలోని కాన్ఫిడెన్స్ ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్. ఈ తాజా ఫోటోల్లో కూడా ఆమె చూపుల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ అభిమానులను కట్టిపడేస్తోంది. "చీరలో కూడా ఇంత హాట్‌గా ఉండటం నీకే చెల్లింది" అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
ఫ్యాన్స్ ను ఊపేస్తున్న డింపుల్ లేటెస్ట్ లుక్:
డింపుల్ హయాతి షేర్ చేసిన ఈ ఫోటోలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈమె మరిన్ని భారీ ప్రాజెక్టులతో మన ముందుకు రాబోతోందని అర్థమవుతోంది. ట్రెడిషనల్ లుక్ అయినా, మోడరన్ లుక్ అయినా డింపుల్ దేనికైనా సై అంటోంది. పట్టుచీరలో ఆమె పండించిన గ్లామర్ షో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికి ఈ 'ఖిలాడీ' బ్యూటీ తన అందచందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
