Begin typing your search above and press return to search.

డింపుల్ కి ఇదే చివరి అవకాశం..!

తెలుగు అమ్మాయి డింపుల్ హయతి డ్యాన్స్ లు అదరగొట్టేస్తుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో జస్ట్ ఒక్క పాటతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.

By:  Ramesh Boddu   |   24 Dec 2025 11:13 AM IST
డింపుల్ కి ఇదే చివరి అవకాశం..!
X

తెలుగు అమ్మాయి డింపుల్ హయతి డ్యాన్స్ లు అదరగొట్టేస్తుంది. గద్దలకొండ గణేష్ సినిమాలో జస్ట్ ఒక్క పాటతో అమ్మడు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఐతే ఆ తర్వాత అమ్మడికి హీరోయిన్ గా ప్రమోషన్ వచ్చేసింది. మాస్ మహారాజ్ రవితేజతో ఖిలాడి సినిమా చేసింది డింపుల్ హయతి. ఐతే ఆ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఇంకా రెండు మూడు సినిమాలు చేసినా డింపుల్ కి లక్ కలిసి రాలేదు. మరోపక్క ఆమె కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం కూడా ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది.

మాస్ రాజా రవితేజతో..

ఆఫ్టర్ షార్ట్ గ్యాప్ డింపుల్ హయతి మరోసారి మాస్ రాజా రవితేజతో కలిసి వస్తుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో నటించింది డింపుల్ హయతి. ఈ సినిమాలో ఆమెతో పాటు ఆషిక రంగనాథ్ కూడా నటించింది. రవితేజ ఎనర్జీతో పాటు ఈ ఇద్దరు ముగ్గుగుమ్మల ఎనర్జీ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఐతే డింపుల్ హయతికి ఇదే చివరి అవకాశమని చెప్పొచ్చు. ఎందుకంటే కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ టైంలో రవితేజతో సినిమా ఆమెకు మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు.

మరి ఈ సినిమాతో అయినా డింపుల్ తన లక్ కలిసి వచ్చేలా చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి. డింపుల్ హయతి గుడ్ లుకింగ్స్ తో పాటు యాక్టింగ్ టాలెంట్ ఉన్నా కూడా సరైన అవకాశాలు రావట్లేదు. ఐతే భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆమె ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాలి. హీరోయిన్ గానే కాదు సినిమాల్లో ఎలాంటి టఫ్ ఛాన్స్ వచ్చినా చేసేస్తా అంటుంది అమ్మడు.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక గొప్ప అవకాశమని..

డింపుల్ హయతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు. మరి ఈ టైంలో అమ్మడు ప్రూవ్ చేసుకుంటుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలుగు సినిమాల్లో టాలెంట్ ఉన్న తెలుగు భామలకు అవకాశాలు రావట్లేదని అంటుంటారు. ఐతే ఆ లిస్ట్ లో డింపుల్ కూడా ఉంది. రవితేజ లాంటి స్టార్ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చినా అమ్మడికి అసలేమాత్రం లక్ కలిసి రావట్లేదు. మరి అమ్మడు ఈసారి సంక్రాంతి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

రవితేజ కూడా మాస్ జాతర సినిమా నిరాశపరచడంతో భర్త మహాశయులకు విజ్ఞప్తితో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అంశాలు పక్కన పెట్టి కంప్లీట్ ఎంటర్టైనర్ మోడ్ లో వస్తున్నాడు రవితేజ. డైరెక్టర్ కిషోర్ తిరుమల సినిమాలు అన్నీ చాలా సెన్సిబుల్ గా కూల్ అండ్ ఎంగేజింగ్ గా ఉంటాయి. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి డైరెక్టర్, హీరో కాంబినేషన్ ని సంథింగ్ స్పెషల్ అనిపించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.