డింపుల్ హయతి రిటైర్మెంట్ ఇచ్చేసినట్లేనా?
ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఎంతో విచిత్రమైనది. `గల్ఫ్` అనే ఓ చిన్న చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటుపై రెండేళ్లకు కోలీవుడ్ లో లాంచ్ అయింది.
By: Srikanth Kontham | 2 Oct 2025 8:45 AM ISTడింపుల్ హయతి సినిమాల కంటే వివాదాల్లో హైలైట్ అయిన పేరు ఇది. అప్పట్లో ట్రాపిక్ డీసీపీతో వివాదం..తాజాగా ఇంట్లో పని వాళ్లను వేధిస్తుందనే వివాదంతో అమ్మడి పేరు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇంకా పాత కేసు కోర్టులో ఉండగానే తాజాగా మరో కేసు పడడం తో సంచలనంగా మారింది. ఈ వివాదాల వెనుక తప్పు ఎవరిది? అన్నది కోర్టులు నిర్దారించిన తర్వాత చర్చించే అంశమనుకోండి. మరి డింపుల్ ప్రోపెషనల్ కెరీర్ సంగతేంటి? అంటే ఉవ్వెత్తున టాలీవుడ్ కి దూసుకొచ్చిన యువ కెరటం? అంతే వేగంగా పతనానికి పడినట్లు కనిపిస్తోంది.
ఆ సినిమాతో లైమ్ లైట్ లోకి:
ఈ అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ ఎంతో విచిత్రమైనది. `గల్ఫ్` అనే ఓ చిన్న చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అటుపై రెండేళ్లకు కోలీవుడ్ లో లాంచ్ అయింది. అదే ఏడాది `గద్దల కొండ గణేష్` లో స్పెషల్ అప్పిరియన్స్ ఇచ్చింది. దీంతో టాలీవుడ్ లో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఓ పెద్ద సినిమాలో ఐటం సాంగ్ తో ఓ గుర్తింపు దక్కింది. చిన్న సినిమా హీరోయిన్ ఒక్కసారిగా స్టార్ హీరో సినిమాలో భాగమవ్వడంతో డింపుల్ హయతి ఎవరు? అనే చర్చ జోరుగా సాగింది.
అగ్ర హీరోలతో చాన్స్.. రెండు డిజాస్టర్లే:
అటుపై బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఆత్రంగిరే` భాగమైంది. దీంతో జాతీయ మీడియాలోనూ అమ్మడి పేరు మారు మ్రోగింది. అనంతరం `ఖిలాడీ`లో రవితేజకు జోడీగా హీరోయిన్ గానే ఛాన్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ లో మీడియాలో అమ్మడి పేరు సంచలనంగా మారింది.` గల్ప్` బ్యూటీకి ఇంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది? అన్న దానిపై రకరకాల డిస్కషన్స్ జరిగాయి. ఆ వెంటనే `రామబాణం`లో గోపీచంద్ సరసన ఛాన్స్ అందుకుంది. అయితే ఈ రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో డింపుల్ హయతి జాడ లేదు.
వివాదం అవకాశాలకు దూరం చేస్తుందా:
రెండేళ్ల కాలంగా అమ్మడు కొత్త సినిమాలు చేయలేదు. ఇంటికే పరిమితమైంది. తాజా వివాదంతో మళ్లీ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో డింపుల్ భవిష్యత్ పై చర్చ జరుగుతోంది. రెండేళ్లగా కెమెరాకు దూరంగా ఉండటంతో కొత్త అవకాశాలు రావడం కష్టమనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జరుగుతోంది. వివాదాలు కూడా అవకాశాలను దూరం చేస్తాయి అన్నది హైలైట్ అవుతోంది. మరి వీటిని బ్రేక్ చేసి కొత్త ఛాన్సులు అందుకుం టుందా? అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిస్తుందా? అన్నది చూడాలి.
