పెళ్లి వార్తలపై డింపుల్ క్లారిటీ.. అసలు నిజం ఏంటంటే?
సాధారణంగా నటీనటుల మీద ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు చాలామంది సైలెంట్‌గా ఉంటారు. కానీ డింపుల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా నేరుగా క్లారిటీ ఇచ్చారు.
By: M Prashanth | 20 Jan 2026 9:25 AM ISTటాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితం గురించి జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. సెలబ్రిటీల గురించి నెట్టింట రకరకాల వార్తలు రావడం సహజమే అయినా, కొన్నిసార్లు అవి శృతిమించినప్పుడు క్లారిటీ ఇవ్వక తప్పదు. లేటెస్ట్ గా డింపుల్ విషయంలో కూడా అదే జరిగింది. ఆమెకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందంటూ ఒక నెటిజన్ చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అసలు విషయం ఏంటంటే, ఒక నెటిజన్ సోషల్ మీడియాలో డింపుల్ గురించి ప్రస్తావిస్తూ ఆమెకు ఇదివరకే వివాహం జరిగిందని కామెంట్ చేశారు. అంతటితో ఆగకుండా డింపుల్, ఆమె భర్త డేవిడ్‌పై పోలీస్ కేసు నమోదైందంటూ ఒక పాత న్యూస్ ఆర్టికల్‌ను కూడా షేర్ చేశారు. దీనిపై డింపుల్ వెంటనే స్పందిస్తూ ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, సదరు నెటిజన్ షేర్ చేసిన ఆర్టికల్ కూడా ఫేక్ అని ఆమె ఘాటుగా బదులిచ్చారు.
సాధారణంగా నటీనటుల మీద ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు చాలామంది సైలెంట్‌గా ఉంటారు. కానీ డింపుల్ మాత్రం సోషల్ మీడియా వేదికగా నేరుగా క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత విషయాలపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల కెరీర్‌తో పాటు ఇమేజ్‌కు కూడా ఇబ్బంది కలుగుతుందని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మవద్దని ఆమె తన అభిమానులకు నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే, డింపుల్ హయాతి రీసెంట్‌గా సంక్రాంతి బరిలో నిలిచారు. ఆమె నటించిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా పండగ కానుకగా థియేటర్లలో విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే, మరోవైపు తనపై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని ఆమె అంతే ధీటుగా ఎదుర్కొంటున్నారు.
ఇక డింపుల్ హయాతి తన పెళ్లి గురించి వస్తున్న పుకార్లకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చేసి సస్పెన్స్‌కు తెరదించారు. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే కెరీర్ లో ఒక బిగ్ టర్నింగ్ సినిమా కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. ఇదివరకు చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్ కాలేదు. ఇక ఇప్పుడు రవితేజతో చేసిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఆడియెన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక నెక్స్ట్ అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.
