గాయకుడు కం నటుడికి మరో బిగ్ బ్లో
నో ఎంట్రీ 2 చిత్రం 2005లో విడుదలైంది. ఇది సూపర్ హిట్ కామెడీ ఫ్రాంఛైజీ. ఇందులో సల్మాన్- అనీల్ కపూర్, పర్ధీన్ లాంటి పెద్ద స్టార్లు నటించారు.
By: Sivaji Kontham | 5 Sept 2025 8:30 AM ISTప్రముఖ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన తాజా చిత్రం `సర్ధార్జీ 3` భారతదేశంలో నిషేధాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం విచిత్రమైనది. ఒక పాకిస్తానీ నటికి అవకాశం ఇచ్చినందున దిల్జీత్ సినిమా చిక్కుల్లో పడింది. పహల్గామ్ దాడికి ముందే పాకిస్తానీ నటికి అవకాశం కల్పించామని అతడు చెప్పినా ఎవరూ వినలేదు.
ఇది దిల్జీత్ కి బిగ్ బ్లో. అతడు ఎన్నో ఆశలు పెట్టుకున్న భారీ చిత్రాన్ని భారతదేశంలో విడుదల చేయలేకపోతే అది తీవ్రమైన నష్టంగా పరిగణించాలి. ఇంతలోనే ఇప్పుడు అతడు మరో బిగ్ బ్లో ని ఎదుర్కొన్నాడు. అతడు ప్రతిష్ఠాత్మక `నో ఎంట్రీ` మూవీ సీక్వెల్ లో నటించాల్సి ఉండగా, దీని నుంచి తప్పుకున్నాడని కథనాలొస్తున్నాయి.
దిల్జీత్ అనూహ్యంగా `నో ఎంట్రీ` సీక్వెల్ నుంచి తప్పుకోవడానికి కారణమేమిటి? అంటే నిర్మాత బోనీకపూర్ చెప్పిన రీజన్ ఆశ్చర్యపరిచింది. అతడు కాల్షీట్లు కేటాయించిన సమయంలోనే విదేశాలలో మ్యూజిక్ కాన్సెర్ట్ చేయాల్సి వచ్చిందని, డేట్లు క్లాష్ అయ్యాయని బోనీ చెబుతున్నా.. ఇది అంత నమ్మబుల్ గా లేదని అంటున్నారు అభిమానులు. ఆస్ట్రేలియా - న్యూజిలాండ్‌లో దిల్జిత్ ఆరా టూర్ అక్టోబర్ 26 నుంచి నవంబర్ 13 వరకూ సాగుతుంది. సినిమా షూటింగ్ షెడ్యూల్‌తో క్లాష్ అవుతోంది. ఫలితంగా అతను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాలేకపోయాడని బోనీ చెప్పారు.
నో ఎంట్రీ 2 చిత్రం 2005లో విడుదలైంది. ఇది సూపర్ హిట్ కామెడీ ఫ్రాంఛైజీ. ఇందులో సల్మాన్- అనీల్ కపూర్, పర్ధీన్ లాంటి పెద్ద స్టార్లు నటించారు. కానీ కాలక్రమేణా నో ఎంట్రీ ఫ్రాంఛైజీ కొనసాగడంలో ఇబ్బందులు ఎదుర్కొంది. హీరోలు అందుబాటులో లేకపోవడంతో బోనీ ఏమీ చేయలేకపోయాడు. చివరికి వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అర్జున్ కపూర్ సహా కుర్రహీరోలతో నో ఎంట్రీ సీక్వెల్ ని ప్రకటించారు బోనీ. కానీ ఈ మూవీ నుంచి ఇప్పుడు దిల్జీత్ నిష్కృమించడంతో క్రేజ్ ఒక్కసారిగి కిందికి పడిపోయింది. దిల్జీత్ కి కాల్షీట్లు కుదరకపోవడమే కారణమా? లేక ఇంకేదైనా కారణమా? అన్నది మరింత స్పష్ఠంగా దిల్జీత్ చెప్పాల్సి ఉంటుంది.
