విడుదలకు ఆ హీరో కొత్త సినిమా.. థియేటర్లలో ఆడియన్స్ చూస్తారా?
అలా ప్రజలలో హీరో దిలీప్ పై నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఈయన నటించిన భభబ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అసలే ఆ హీరోయిన్ కేసులో ఈయనపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ పెరిగిపోయింది.
By: Madhu Reddy | 18 Dec 2025 11:00 AM ISTఈ మధ్యకాలంలో కొంతమంది హీరోల ప్రవర్తన.. వారి కెరియర్ పై పడుతోంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా వీరి సినిమాల సంగతి పక్కన పెడితే.. నిజజీవితంలో వీరు చేస్తున్న పనులు ప్రజలలో వ్యతిరేకతను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది అభిమానిని హత్య చేసిన కేసులో హీరో దర్శన్ ఇటు ప్రజలు అటు ప్రేక్షకుల నుంచి ఏ రేంజ్ లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆయన సినిమా విడుదలవగా ఆ సినిమాను థియేటర్లలో ఫ్లాప్ చేసి ఆయనపై ఉన్న వ్యతిరేకతను నిరూపించారు.
అయితే ఇప్పుడు అలాంటి ఒక హీరో సినిమా థియేటర్లలోకి రాబోతోంది..ఆయన చేసిన పనికి ఇప్పటికే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అలాంటి ఆయన సినిమాను థియేటర్లలో ఆడియన్స్ చూస్తారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక 10 మంది దుండగులు ఒక మలయాళ హీరోయిన్ పై లైంగిక దాడి చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ దాడిని ఈరోజు దిలీప్ ప్లాన్ చేశారు అని అప్పట్లో కేసు కూడా ఫైల్ చేశారు. అంతేకాదు మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన దిలీప్ బెయిల్ మీద బయటకు వచ్చారు. కానీ దాదాపు 8 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. అయితే ఇటీవల ఎర్నాకులం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు.. దిలీపే ఈ దుర్ఘటనను ప్లాన్ చేశాడు అనడానికి సరైన ఆధారాలు లేవు అని నిర్దోషిగా భావిస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది.
అలాగే మరో ముగ్గురిని కూడా నిర్దోషులుగా భావించిన కోర్టు వారిని విడుదల చేసింది..ఇక మిగిలిన ఆరుగురికి 20 సంవత్సరాల కారాగార కఠిన శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇకపోతే కోర్టు దిలీప్ ని నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ.. ప్రజలు మాత్రం ఈయనను నిర్దోషిగా భావించడం లేదు. దీనికి తోడు పలువురు సెలబ్రిటీలు, దిలీప్ మాజీ భార్య మంజు, అలాగే కొంతమంది హీరోలు కూడా కోర్టు తీర్పు పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.. దీనికి తోడు ఇటీవల కేరళ ఆర్టీసీ బస్సులో దిలీప్ సినిమాలలో ఒక సినిమాను ప్రదర్శించగా.. మహిళలు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్ చేసేదేమీ లేక సినిమా మార్చేశారు
అలా ప్రజలలో హీరో దిలీప్ పై నెగిటివిటీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా ఈయన నటించిన భభబ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అసలే ఆ హీరోయిన్ కేసులో ఈయనపై పూర్తిస్థాయిలో నెగెటివిటీ పెరిగిపోయింది.
ఇలాంటి సమయంలో ఈయన నటిస్తున్న సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వస్తుండగా.. అసలు ఈ సినిమాను ఆడియన్స్ చూస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలో కొంతమంది బడా హీరోలు నటిస్తుండడంతో దిలీప్ కారణంగా ఆ హీరోలపై కూడా ప్రజలలో వ్యతిరేకత ఏర్పడింది. ఏది ఏమైనా ఈ సినిమాను అసలు ప్రేక్షకులు ఆదరిస్తారా? ఈ సినిమాను సక్సెస్ చేస్తారా అని అనుమానాలను నెటిజెన్స్ వ్యక్తపరుస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
