పవన్ కళ్యాణ్ పై అలాంటి కామెంట్స్.. దిల్ రాజు భార్య షాకింగ్ కౌంటర్స్..
ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని చెప్పిన వైఘా రెడ్డి.. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు.
By: M Prashanth | 20 Jan 2026 8:38 AM ISTటాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు. అదే సమయంలో దిల్ రాజుకు మాత్రమే కాదు.. ఆయన భార్య వైఘా రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడం గమనార్హం.
ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని చెప్పిన వైఘా రెడ్డి.. తాజాగా మరోసారి పవన్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న వైఘా.. పవన్ కళ్యాణ్ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ కోసం మాట్లాడారు. ఆ సమయంలో ఆమె చేసిన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట వైఘా రెడ్డి మాట్లాడిన వీడియో.. ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అసలు ఆమె అన్నారంటే?
'కుంభమేళాలో స్నానం చేసేటప్పుడు చాలా మంది ట్రోల్స్ చేశారు.. వారిందరికీ పవన్ ఆన్సర్ ఇచ్చారు.. అంత పెద్ద స్టార్ అయిన ఆయన పొలిటికల్ గా కష్టాలు పడుతున్నప్పుడు ఫ్యాన్ గర్ల్ గా మీరు ఏమనుకుంటున్నారు' అని హోస్ట్ అడగ్గా.. పవన్ పై కామెంట్స్ చేసే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని వైఘా రెడ్డి చెప్పారు. వాళ్లకు ఏం చేతకాదని అన్నారు. అలాంటి వాళ్లే కామెంట్స్ చేస్తారని చెప్పుకొచ్చారు. పవన్ ఏది మాట్లాడినా దిల్ సే మాట్లాడతారని, అందుకే ఇష్టమని చెప్పారు.
'ఆయనకు ఎలాంటి ఫిల్టర్ ఉండదు. అందుకే సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు ఏదైనా చేయాలనుకున్నారు. ఎప్పుడూ హార్ట్ నుంచి స్ట్రయిట్ గా మాట్లాడుతారు. అందుకే ఒక్కసారి ఎమోషనల్ గా మాట్లాడుతారు.. ఒక్కసారి అరిచేస్తారు.. కొన్నిసార్లు ఎమోషన్ అవుతారు. అవన్నీ ఆయన హృదయం నుంచి వచ్చిన ఎమోషన్స్. అప్పుడే ఎవరి పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్' అంటూ చెప్పుకొచ్చారు వైఘా రెడ్డి.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన ఓజీ సినిమా గురించి మాట్లాడారు. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన ఆ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉందంటూ ప్రశంసలు కురిపించారు. తనకు సినిమా బాగా నచ్చిందని చెప్పారు. మూవీలో మెయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్, ఎమోషన్స్, ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు.
అలా పవన్ తోపాటు ఓజీ మూవీపై వైఘా రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా.. ఇప్పటికే కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న దిల్ రాజు.. పవన్ తో వకీల్ సాబ్ మూవీ చేశారు. 2021లో రిలీజైన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరో సినిమాను పవర్ స్టార్ తో చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. మరి చూడాలి ఆ ప్రకటన ఎప్పుడు వస్తుందో..
