Begin typing your search above and press return to search.

సల్మాన్ మూవీ రిలీజ్ పై దిల్ రాజు సెంటిమెంట్!

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 Jun 2026 12:51 PM IST
సల్మాన్ మూవీ రిలీజ్ పై దిల్ రాజు సెంటిమెంట్!
X

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సినిమా స్కేల్, షూటింగ్ స్పీడు, సల్మాన్ ఖాన్ మల్టిపుల్ లుక్స్, హీరోయిజంతో నిండిన ఎలివేషన్ సీన్స్ గురించి ఇప్పటికే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించిన దిల్ రాజు.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ వెనుక ఉన్న ఓ స్పెష‌ల్ సెంటిమెంట్‌ను బయటపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాను 2027 ఈద్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఈ రిలీజ్ ప్లాన్ వెనుక కేవలం బాక్సాఫీస్ లెక్కలు మాత్రమే కాకుండా, ఓ ప‌ర్స‌న‌ల్ సెంటిమెంట్ కూడా ఉందని దిల్ రాజు తెలిపారు. సల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, కో ప్రొడ్యూస్క శిరీష్‌ల పుట్టిన తేదీలను కలిపితే మొత్తం 9 నెంబ‌రే వస్తుందని, అందుకే 2027 సంవత్సరాన్ని ఎంచుకున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమా తన నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న 63వ సినిమా అని, 6+3 కూడా 9 అవుతుందని దిల్ రాజు ప్రస్తావించారు. ఈ రెండు అంశాలు కలిసిరావడంతో 2027లోనే సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వివరించారు. ఇండస్ట్రీలో స‌క్సెస్‌ అయిన చాలామంది నిర్మాతలు, డైరెక్ట‌ర్లు ఇలాంటి ప‌ర్స‌న‌ల్ సెంటిమెంట్లను ఫాలో అవ‌డం కొత్తేమీ కాకపోయినా, ఇంత స్పష్టంగా కారణాన్ని వెల్లడించడం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై వేగంగా సాగుతోంది. అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తిచేయాలనే టార్గెట్ తో టీమ్ పనిచేస్తోంది. సల్మాన్ ఖాన్ కూడా షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ పాల్గొంటున్నారని దిల్ రాజు వెల్లడించారు. ఆల్రెడీ పూర్తైన సీన్స్ తో సినిమాను చూస్తే వావ్ అనిపించే స్థాయిలో ఉంద‌ని, భారీ హీరోయిజం, ఆడియ‌న్స్ ను ఆశ్చర్యపరిచే ఎన్నో మూమెంట్స్ సినిమాలో ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈద్ సీజన్‌లో సల్మాన్ ఖాన్‌కు ఉన్న బాక్సాఫీస్ స్ట్రెంగ్త్, వంశీ పైడిపల్లి కమర్షియల్ టేకింగ్, దిల్ రాజు నిర్మాణ విలువలు, ఇప్పుడు ఈ 9 నెంబ‌ర్ సెంటిమెంట్ కూడా కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఒక్కో అప్డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు మాత్రం మరింత ఎత్తుకు చేరుతున్నాయి.