రామాయణ.. దిల్ రాజుది సేఫ్ గేమేనా..
అయితే ఆ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియకపోవడం వల్ల దిల్ రాజుకు ఎలాంటి నష్టం ఉండదని ఇప్పుడే చెప్పలేం.
By: M Prashanth | 9 Oct 2026 9:19 PM ISTబడా సినిమా.. భారీ అంచనాలు.. వంద కోట్లకు అటూఇటుగా బిజినెస్. అంత డబ్బులు పెట్టి తెలుగు రైట్స్ ను దక్కించుకోవడమంటే మామూలు విషయం కాదు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం రామాయణ విషయంలో అదే చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారన్నది కాదు.. ఆ డీల్ లో ఆయనకు ఉన్న రిస్క్ ఎంతన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
రణబీర్ కపూర్, సాయిపల్లవి, సన్నీ డియోల్, యశ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న రామాయణ పార్ట్ 1 నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా విలువైన ఆ డీల్ పై అందరి ఫోకస్ పడింది. బాలీవుడ్ చిత్రానికి ఇంత పెద్ద మొత్తం పెట్టడం వెనుక ప్లాన్ ఏంటోనన్న ఇంట్రెస్ట్ నెలకొంది.
రామాయణం మనకు కొత్త కథ కాదు. గతంలోనూ రామాయణం ఆధారంగా పలు సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అందుకే ఆ కథకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే కథ పరిచయం ఉన్నంత మాత్రాన సినిమా ఆడుతుందని చెప్పలేం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే స్క్రీన్ పై ఆ స్టోరీని చూపించే విధానం ఓ రేంజ్ లో ఉండాల్సిందే.
రణబీర్ కపూర్, సాయిపల్లవి వంటి నటులు తమ పాత్రల్లో ఎలా కనిపిస్తారు, యుద్ధ సన్నివేశాలు ఎలా ఉంటాయి, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయన్నది మెయిన్. సినిమా చూసిన తర్వాత అద్భుతంగా ఉందనే మాట వస్తే వసూళ్లకు అవకాశాలు పెరుగుతాయి. లేదంటే భారీ అంచనాలను అందుకోవడం కష్టమే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు భారీ చిత్రాలను ఆదరిస్తున్నప్పటికీ, కంటెంట్ నచ్చకపోతే వసూళ్లు తగ్గిపోతున్న సందర్భాలూ ఉన్నాయి.
అయితే ఆ డీల్ లో దిల్ రాజుకు కొంత రిలీఫ్ ఇచ్చే అంశం ఉందని తెలుస్తోంది. ఆయన సాధారణంగా హక్కులు కొనుగోలు చేసే పద్ధతిలో కాకుండా, ‘రిటర్నబుల్ అడ్వాన్స్’ విధానంలో తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పద్ధతిలో సినిమా విడుదల కోసం ముందుగా కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. ఒప్పందంలోని కండీషన్స్ బట్టి సినిమా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోతే, ముందే అనుకున్న మొత్తాన్ని నిర్మాతలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఆ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా తెలియకపోవడం వల్ల దిల్ రాజుకు ఎలాంటి నష్టం ఉండదని ఇప్పుడే చెప్పలేం. అడ్వాన్స్ తిరిగి చెల్లించే రూల్స్, డెడ్ లైన్స్, ఇతర కండీషన్స్ పై అసలు లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పెట్టిన డబ్బు తిరిగి వచ్చినా, అంత పెద్ద మొత్తాన్ని కొంతకాలం ఒకే సినిమాపై ఉంచడం వల్ల ఇతర బిజినెస్ ఛాన్సులను వదులుకోవాల్సి రావచ్చు.
అలాగే డబ్బు తిరిగి రావడం లైట్ అయితే ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మరోవైపు సినిమా భారీ విజయం సాధిస్తే, తెలుగు మార్కెట్ లో మరింత క్రేజ్ సంపాదించడంతో పాటు బిజినెస్ బెనిఫిట్స్ కూడా దక్కవచ్చు. అలా రామాయణ తెలుగు హక్కుల విషయంలో మాత్రం దిల్ రాజు లెక్కలు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. మరి. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
