రాజుగారికే ఓటేసిన రాజమౌళి!
వాళ్ల ఇమేజ్ ఉండదన్నది రాజుగారి మాటల్లో క్లియర్ గా బయట పడింది. హీరోల ఇమేజ్ ని పెంచేది కేవలం థియేటర్ ఎంటర్ టైనర్ మాత్రమేనన్నది రాజుగారి బలమైన వాదన.
By: Srikanth Kontham | 27 Aug 2025 5:00 PM ISTఎన్ని ఓటీటీలు వచ్చినా? ఎంత కాంపిటీషన్ ఉన్నా? థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇంకే మాధ్యమం అందిం చలేదన్నది నిర్మాత దిల్ రాజు ఎప్పుడు స్ట్రాంగ్ గా చెప్పే మాట. ఈ విషయంలో రాజుగారు ఒంటెద్దు పోకడే హైలైట్ అవుతుంది. సురేష్ బాబు లాంటి వారు వెర్షన్ వేరుగా ఉన్నా? రాజుగారు మాత్రం ఈ విష యంలో ఎన్నడు యూ టర్న్ తీసుకోలేదు. ప్రేక్షకుడికి సినిమా చూసిన ఫీలింగ్ రావాలంటే? అది కేవలం థియేటర్లో మాత్రమే సాధ్యమవుతుందని ఏ వేదికపైనైనా గట్టిగా చెబుతారు. అదే జరగని రోజు హీరోలు ఉండరు.
రాజుగారు లెక్క అలా:
వాళ్ల ఇమేజ్ ఉండదన్నది రాజుగారి మాటల్లో క్లియర్ గా బయట పడింది. హీరోల ఇమేజ్ ని పెంచేది కేవలం థియేటర్ ఎంటర్ టైనర్ మాత్రమేనన్నది రాజుగారి బలమైన వాదన. తాజాగా ఆయన మాటలతో దర్శక శిఖరం రాజమౌళి కూడా ఏకీభవించినట్లే కనిపిస్తుంది. ఓటీటీ-థియేటర్ సినిమా మధ్య వ్యత్యాసం గురించి ఏనాడు జక్కన్న స్పందించలేదు. తొలిసారి ఓ వేదికలో రాజమౌళి ఆ విషయంపై స్పందించడం విశేషం. రజనీకాంత్ లేదా సల్మాన్ ఖాన్ ఓ పెనింగ్ సీన్ లో కనిపించినప్పుడు థియేటర్లో జనాలు ఎలా స్పందిస్తారో? అందరికీ తెలుసు.
రాజమౌళి వ్యత్యాసమిది:
విజిల్స్ వేస్తారు. కాగితాలు ఎగరేస్తారు. అభిమానులంతా సీటులో నుంచి పైకి లేచి డాన్సులు చేస్తారు. గ్రూపులు కడతారు. కానీ అదే సినిమా ఓటీటీ రిలీజ్ అయితే ఇదేది కనిపించదు. ఎవరి ఇంట్లో వారే ఎవరికి వారు తలుపులు మూసుకుని ఈలలు వేసుకోవాలి. అందులో ఏమైనా కిక్ ఉంటుందా? సినిమా చూసిన అనుభూతి కలుగుతుందా? ఇదే థియేటర్...ఓటీటీ రిలీజ్ మధ్య ప్రధాన వ్యత్యాసం. థియేటర్లో మాత్రమే సినిమా చూసిన గొప్ప అనుభూతికి లోనవుతాం అన్నారు. దీంతో థియేటర్ రిలీజ్ విషయంలో రాజమౌళి ఎంత ఆసక్తిగా ఉన్నారు? అన్నది అర్దమవుతుంది.
అది సాధ్యమేనా?
ఇప్పటికే థియేటర్ వ్యవస్థ కుప్పకూలిపోతున్న పరిస్థితులు కనిపిస్తన్నాయి. నష్టాలు రావడంతో థియే టర్లు మూసేయడం లేదా ఫంక్షన్ హాల్స్ గా మార్చడం జరుగుతుంది. ఓటీటీ ప్రభావం కూడా థియేటర్లపై పడింది. ఇందులో మార్పు రావాలని ప్రేక్షకులు సహా చిత్ర పరిశ్రమలు కోరుకుంటున్నాయి. కానీ అందుకు ఇండస్ట్రీ తీసుకోవాల్సిన చర్యలు మాత్రమే కనిపించలేదు.రిలీజ్ ల విషయంలో ఓటీటీ ప్రాధాన్యత తగ్గించగ గలిగితే థియేటర్ కు ఊపిరి పోసినట్లేనన్నది విశ్లేషకుల మాట. మరి అది సాధ్యవమతుందా? లేదా? అన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.
