అదిరిపోయే రేంజ్ లో రాజు గారి కంబ్యాక్
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి మళ్లీ మంచి సక్సెస్ ను అందుకున్న దిల్ రాజు, ఆ సినిమా తనకు కొత్త ఎనర్జీని ఇచ్చిందని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 14 Oct 2025 10:00 PM ISTదిల్ రాజు. తెలుగు రాష్ట్రాల్లో ఈయన తెలియని వారు లేరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన తర్వాత నిర్మాతగా మారి, గత కొంతకాలంగా టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో ఒకరిగా రాణిస్తున్నారు. దిల్ రాజు నుంచి సినిమా వస్తుందంటే ఆ సినిమా మ్యాగ్జిమమ్ హిట్ అనే పేరును సంపాదించుకున్నారు. ఆయన జడ్జిమెంట్‌కు అంత వాల్యూ ఉండేది.
గత కొన్నాళ్లుగా పెద్దగా లక్ లేదు
కానీ కొన్నాళ్లుగా దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయి సక్సెస్ అందుకోవడం లేదు. రీసెంట్ టైమ్స్ లో సంక్రాంతికి వస్తున్నాం తప్పించి ఆయనకు, ఆయన బ్యానర్ కు సాలిడ్ హిట్ అనేది లేదు. ఆయనేం చేసినా పెద్దగా కలిసి రావడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు కూడా సభా ముఖంగా ఒప్పుకుంటున్నారు.
ఓజి కొత్త ఎనర్జీని ఇచ్చింది
అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి మళ్లీ మంచి సక్సెస్ ను అందుకున్న దిల్ రాజు, ఆ సినిమా తనకు కొత్త ఎనర్జీని ఇచ్చిందని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ ఎనర్జీతోనే దిల్ రాజు ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి దిల్ రాజు లైన్ లో పెడుతుంది కేవలం తెలుగు ప్రాజెక్టులు మాత్రమే కాదు, వివిధ ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలతో రాజు గారు సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది.
మరోసారి రిస్క్ చేస్తున్న దిల్ రాజు
తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలను తీయాలని ప్రయత్నిస్తున్న దిల్ రాజు, కోలీవుడ్ లో అజిత్ తో సినిమా తీయాలని చూస్తున్నారట. అవి మాత్రమే కాకుండా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో సంక్రాంతికి వస్తున్నాంను రీమేక్ చేయడంతో పాటూ, సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలతో నిర్మాతగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాలతో డిజప్పాయింట్ అయిన దిల్ రాజు, ఇప్పుడు మరోసారి బాలీవుడ్ వైపు కన్నేశారని, ఈసారి ఎలాగైనా అక్కడ సక్సెస్ అందుకోవాలని దిల్ రాజు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారైనా రాజు గారి రిస్క్ కు తగ్గ ఫలితం వస్తుందేమో చూడాలి.
