Begin typing your search above and press return to search.

దిల్ రాజు మళ్ళీ పాత రూట్ పట్టుకున్నాడా?

టాలీవుడ్ లో దిల్ రాజు పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈమధ్య ఆయన కంప్లీట్ గా స్టార్ కాంబినేషన్ చుట్టూనే తిరుగుతున్నారనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి.

By:  M Prashanth   |   1 July 2026 10:54 AM IST
దిల్ రాజు మళ్ళీ పాత రూట్ పట్టుకున్నాడా?
X

టాలీవుడ్ లో దిల్ రాజు పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఈమధ్య ఆయన కంప్లీట్ గా స్టార్ కాంబినేషన్ చుట్టూనే తిరుగుతున్నారనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని తన ప్రొడక్షన్ స్ట్రాటజీని పూర్తిగా మార్చే పనిలో పడ్డారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా మళ్ళీ తనకి ఎంతో కలిసొచ్చిన పాత ట్రాక్ మీదకే వెళ్లినట్లు తెలుస్తోంది.

ఒకప్పుడు ఆయన బ్యానర్ లో సినిమా అంటే కొత్త డైరెక్టర్లకు వరుస ఛాన్సులు వచ్చేవి.

ఆర్య సినిమాతో సుకుమార్, బొమ్మరిల్లుతో భాస్కర్, కొత్త బంగారు లోకం సినిమాతో శ్రీకాంత్ అడ్డాల లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర జాక్ పాట్ లాభాలు అందుకోవడమే కాకుండా కంటెంట్ తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళంతా స్టార్ డైరెక్టర్స్ గా మారిపోయారు.

కాలక్రమంలో ఆయన పెద్ద హీరోలతో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ వైపు అడుగులు వేశారు.

స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే బిజినెస్ పరంగా సేఫ్ అయినా సరే బడ్జెట్ టెన్షన్లు చాలా ఉంటాయి. పైగా ఇప్పుడున్న ఆడియన్స్ కేవలం స్టార్ డమ్ ని చూసి థియేటర్లకు రావడం లేదు. స్టోరీ నెరేషన్ కొత్తగా ఉంటేనే టికెట్ తెగుతోంది. కంటెంట్ కనెక్ట్ అవ్వకపోతే సినిమాను మొదటి రోజే రిజెక్ట్ చేస్తున్నారు. ఈ గ్రౌండ్ రియాలిటీని కరెక్ట్ గా అర్థం చేసుకున్న దిల్ రాజు డీఆర్డీ పేరుతో మరోసారి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

నేటి జనరేషన్ పల్స్ పట్టుకునే కుర్ర డైరెక్టర్ల కోసం ఏకంగా ఒక స్పెషల్ స్క్రిప్ట్ టీమ్ ని కూడా రంగంలోకి దించారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చే కొత్త వాళ్లకు తన బ్యానర్ లో రెడ్ కార్పెట్ వేస్తూ తనదైన స్టైల్ లో ప్లానింగ్ చేసుకుంటున్నారు. కంటెంట్ నచ్చితే చాలు కార్పొరేట్ సంస్థలతో కలిసి వరుస సినిమాలు నిర్మించడానికి అడుగులు వేస్తున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి చిన్న సినిమాలు అరడజను దాకా రిలీజ్ చేయాలనేది వాళ్ల టార్గెట్ గా కనిపిస్తోంది.

బడ్జెట్ తక్కువ కాబట్టి ఒక ప్రాజెక్ట్ తో హిట్ కొట్టినా మిగతా వాటికి పెట్టిన పెట్టుబడి ఈజీగా వెనక్కి వస్తుందనేది ఒక పక్కా బిజినెస్ కాలిక్యులేషన్. స్టార్ హీరోల డేట్స్ కోసం ఏళ్ల తరబడి వెయిట్ చేసే కన్నా కథను నమ్ముకుని కొత్త వాళ్ళతో మ్యాజిక్ చేయడమే బెటర్ అని ఆయన ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది. దిల్ రాజు తన పాత సక్సెస్ ఫార్ములాతో మళ్ళీ ఒకప్పటి లాగా బ్లాక్ బస్టర్స్ ఇస్తారో లేదో చూడాలి. ఇండస్ట్రీలో ఎదగాలని చూస్తున్న కొత్త దర్శకులకు మాత్రం ఇదొక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎల్లమ్మ, వంశీ పైడిపల్లి - సల్మాన్ ఖాన్, రౌడి జనార్దన్ ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి.