ఇండస్ట్రీకి ఎనర్జీ ఇచ్చిన ఇరుముడి.. దిల్ రాజు ఏమన్నారంటే..
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న రవితేజ ఇరుముడి గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
By: M Prashanth | 31 Aug 2026 5:03 PM ISTపాన్ ఇండియా మైథలాజికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న సినిమా కూర్మావతార్. శివరాజ్ కుమార్, రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా గురించి మాట్లాడుతూనే మరో ఆసక్తికరమైన అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తున్న రవితేజ ఇరుముడి గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇరుముడి సినిమా ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చిందని దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం ఆ సినిమాలో నటించిన వారికే పరిమితం కాకుండా మొత్తం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఊపునిచ్చిందని చెప్పారు. ప్రేక్షకులు తండోపతండాలుగా థియేటర్లకు వస్తుంటే సినిమాలు తీసే నిర్మాతలకు దర్శకులకు ఎంతో ధైర్యం వస్తుందని వివరించారు.
ఈ సినిమాతో ఇండస్ట్రీకి ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చింది గురుస్వామి అంటూ (సాయి కుమార్ పాత్ర) దిల్ రాజు ప్రత్యేకంగా హ్యాట్సాఫ్ చెప్పారు. దిల్ రాజు చెప్పినట్లుగానే ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ దాటి రవితేజ కెరీర్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. గతంలో మాస్ రాజా కెరీర్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ధమాకా రికార్డును ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ చేసింది.
వంద కోట్ల మార్క్ కోసం ఒకప్పుడు కష్టపడిన రవితేజ ఈసారి చాలా ఈజీగా ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసి భారీ లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ సినిమాకు ముఖ్యంగా నైజాం ఏరియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే అక్కడ 50 కోట్ల రూపాయల వరకు గ్రాస్ రాబట్టడం విశేషం. ఈ ప్రాంతం హక్కులు రవితేజ వద్దే ఉండటంతో ఆయనకు రికార్డులతో పాటు వ్యాపార పరంగా భారీ లాభాలు దక్కుతున్నాయి.
రెండో వారం మొదలయ్యాక టాక్సిక్ లాంటి కొత్త సినిమాలు వచ్చినప్పటికీ ఇరుముడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతుండటంతో వీకెండ్ లో చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఇరుముడి లాంటి ప్రాజెక్ట్ ఇంత త్వరగా లాభాల్లోకి రావడం గొప్ప విషయం. అందుకే దిల్ రాజు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ ఇరుముడి 200 కోట్ల మార్క్ ను అందుకుంటుందా లేదా అనే దానిపైనే పడింది. రెండో ఆదివారం పూర్తయ్యాక దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
