ఆయన దెబ్బకి అంతా వెనక్కి!
ఈ పరాజయం కేవలం ఒక సినిమా నష్టంతో ఆగిపోలేదని టాలీవుడ్ వర్గాల్లో పెద్దల ఆలోచనా ధోరణినే మార్చివేసిందని తెలుస్తోంది.
By: Srikanth Kontham | 23 Oct 2026 9:00 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి దర్శకుడిగా పేరుగాంచిన శంకర్‌తో సినిమా చేయాలని ఏ ప్రొడ్యూసర్ అయినా కలలు కంటారు. అయితే టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగల్చడం టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సినిమా ఫలితం టాలీవుడ్ చిత్రసీమపై గట్టి ప్రభావమే చూపిందని తాజాగా వెలుగులోకి వస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై ఆరంభంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు కెరీర్లోనే ఓ మైలురాయిగా భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో పాటు భారీ ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఈ పరాజయం కేవలం ఒక సినిమా నష్టంతో ఆగిపోలేదని టాలీవుడ్ వర్గాల్లో పెద్దల ఆలోచనా ధోరణినే మార్చివేసిందని తెలుస్తోంది. శంకర్‌తో కలిసి పనిచేయాలని గతంలో ఆశపడిన పలవురు ప్రముఖ తెలుగు నిర్మాతలు ఇప్పుడు ఆయనతో సినిమాలు చేసే సాహసం చేయలేక వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్లు, పెద్ద దర్శకులు అనే హంగుల కంటే కంటెంట్, స్క్రిప్ట్ క్లారిటీ ఎంత ముఖ్యమో ఈ అనుభవం తమకు నేర్పిందని నిర్మాతలు భావిస్తున్నారట.
ఈ చిత్రం షూటింగ్ సమయంలో .. ఎడిటింగ్ దశలో తలెత్తిన కొన్ని సవాళ్లు తనను ఎంతగానో కుంగదీశాయని దిల్ రాజు స్వయంగా పలు సందర్భాలలో ఓపెన్‌గా మాట్లాడారు. పెద్ద దర్శకులతో పనిచేసేటప్పుడు కాంట్రాక్ట్‌లో షరతులు, కంటెంట్ విషయంలో మరింత పక్కాగా ఉండాల్సి ఉండేనని తన కెరీర్లో ఇది ఓ పాఠంలాంటి అనుభవమని పేర్కొన్నారు. ఈ అనుభవం వల్ల భవిష్యత్తులో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు.
శంకర్ వంటి బ్రాండ్ వ్యాల్యూ ఉన్న దర్శకుడితో సినిమా చేసి చేతులు కాల్చుకున్న ప్రొడ్యూసర్స్ ఉదంతం టాలీవుడ్‌లోని ఇతర నిర్మాణ సంస్థలను కూడా ఆలోచనలో పడేసింది. కేవలం క్రేజ్ ఉన్న కాంబినేషన్ల వెనుక పరుగులు పెట్టకుండా కథపై పూర్తి పట్టు ఉంటేనే భారీ పెట్టుబడులు పెట్టాలనే చర్చ మరసారి టాలీవుడ్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. దీంతో మిగతా నిర్మాతలు సైతం శంకర్ ప్రాజెక్ట్‌ల వైపు అడుగులు వేయడానికి ఆలోచిస్తున్నారు.
మొత్తానికి దిల్ రాజు చేదు అనుభవం టాలీవుడ్ దర్శక-నిర్మాతల సమీకరణాలను పూర్తిగా మార్చివేసిందనే చెప్పాలి. ఒకే ఒక్క సినిమా ఫలితం టాలీవుడ్లో ఎలాంటి ఆలోచనా మార్పులకు కారణమైందనేది ఫిలింనగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు చేస్తారనేది చూడాలి.
