Begin typing your search above and press return to search.

ఎల్లమ్మ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..?

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఎస్.వి.సీ బ్యానర్ కి ఒక సెపరేట్ క్రేజ్ వచ్చేలా చేశారు.

By:  Ramesh Boddu   |   26 Nov 2025 11:59 AM IST
ఎల్లమ్మ.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..?
X

దాదాపు రెండు దశాబ్దాలకు పైగా దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఎస్.వి.సీ బ్యానర్ కి ఒక సెపరేట్ క్రేజ్ వచ్చేలా చేశారు. ఐతే మొదట్లో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పించిన ఆయన ఆ తర్వాత స్టార్ సినిమాలను చేసి సక్సెస్ అందుకున్నారు. ఐతే ఈమధ్య ఆయన చేసిన సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ ఇచ్చినా అదే సీజన్ లో వచ్చిన గేం ఛేంజర్ తో పాటు ఆ తర్వాత వచ్చిన తమ్ముడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి.

ఎల్లమ్మ హీరో ఎవరన్నది డిసైడ్ అయితే షూటింగ్ మొదలు పెట్టడమే..

అందుకే బలగం వేణుతో ఎల్లమ్మ సినిమా అనౌన్స్ చేసి చాలా టైం అవుతున్నా కూడా ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఎల్లమ్మ సినిమా కథ, హీరోయిన్, ప్రీ ప్రొడక్షన్ అంతా పూర్తైంది. హీరో ఎవరన్నది డిసైడ్ అయితే షూటింగ్ మొదలు పెట్టడమే. కానీ ఈ హీరో విషయంలోనే 20 ఏళ్ల అనుభవం ఉన్న దిల్ రాజు కూడా కన్ ఫ్యూజ్ అవుతున్నారు. ముందు నితిన్ తోనే ఎల్లమ్మ అనుకున్న దిల్ రాజు తమ్ముడు రిజల్ట్ చూసి వెనకడుగు వేశాడు.

ఇక తెలుగులో మిగతా ఒకరిద్దరు హీరోలతో పాటు తమిళ హీరో పేరు కూడా వినపడింది. ఐతే ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ని సిల్వర్ స్క్రీన్ పై హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా చేస్తున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. కానీ అందులో కూడా ట్విస్ట్ ఉందని మళ్లీ షాక్ ఇచ్చారు. అసలు ఇవన్నీ ఎందుకు మనమే ఒక అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేస్తే బాగుంటుందని దిల్ రాజు ఫిక్స్ అయ్యారట.

అఫీషియల్ కాస్ట్ ఎవరన్నది డిసెంబర్ లో చెప్పేస్తున్నారట..

ఎల్లమ్మ గురించి అఫీషియల్ కాస్ట్ ఎవరన్నది డిసెంబర్ లో చెప్పేస్తున్నారట. ఎల్లమ్మ గురించి ఇన్నాళ్లు వాళ్లు వీళ్లు వార్తలు రాయడం తప్ప చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. సో దిల్ రాజు అండ్ టీం ఇవ్వబోతున్న ఈ అప్డేట్ కోసం ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం దేవి శ్రీ ప్రసాద్ తోనే ఎల్లమ్మ ప్రయోగం చేయబోతున్నారట దిల్ రాజు.

ఎల్లమ్మకు దేవినే హీరో అంటూ ఇండస్ట్రీ క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇక హీరోయిన్ గా కీర్తి సురేష్ ఫిక్స్ అని తెలిసిందే. ఐతే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా దేవి శ్రీ ప్రసాద్ అందిస్తాడని తెలుస్తుంది. సో దేవి తో మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశం అందుకున్న డిఎస్పీ ఈసారి అదే దేవి కథతో తెర మీదకు తెరంగేట్రం చేస్తున్నాడు. ఓ విధంగా ఇది వేణు యెల్దండి రాసిన స్క్రిప్ట్ అయినా కూడా ఎల్లమ్మకు ఎవరు కావాలో ఆమె ఎంపిక చేసుకుందని చెప్పుకోవచ్చు. ఐతే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంటుంది.