ఎల్లమ్మ : బాబోయ్ ఇంత సస్పెన్స్ అవసరమా?
సాయి పల్లవి ఇప్పటికే దిల్ రాజు బ్యానర్‌లో సినిమాలు చేసిన విషయం తెల్సిందే. అందుకే ఆమెతో మరో ఈ సినిమాలో దిల్ రాజు నటింపజేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు.
By: Ramesh Palla | 7 July 2026 1:14 PM IST'బలగం' సినిమా తర్వాత దర్శకుడు వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న మూవీ 'ఎల్లమ్మ'. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా గురించి చర్చలు పతాక స్థాయిలో జరుగుతున్నాయి. హీరోగా నాని చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల తప్పుకున్న విషయం తెల్సిందే. నాని తప్పుకున్న తర్వాత చాలా మంది హీరోల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఒకానొక దశలో నితిన్‌తో షూటింగ్ ప్రారంభం ఖాయం అనుకున్నారు. కానీ నితిన్‌తోనూ ఎల్లమ్మ ముందడుగు పడలేదు. ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర దించుతూ 'ఎల్లమ్మ' సినిమాను దేవి శ్రీ ప్రసాద్ హీరోగా రూపొందించబోతున్నట్లుగా దిల్ రాజు అండ్ టీం మెంబర్స్ అధికారికంగా ప్రకటించారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ నటుడిగా అది కూడా లీడ్ రోల్‌లో మొదటి సారి, అలాంటి దేవి శ్రీ నెత్తిన ఇంత పెద్ద భారం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
దిల్ రాజు బ్యానర్‌లో వేణు 'ఎల్లమ్మ' మూవీ...
దేవి శ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోతున్న 'ఎల్లమ్మ' సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ఎక్కువ శాతం మంది సాయి పల్లవి అయితే ఎల్లమ్మ సినిమాకు యాప్ట్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సమంత, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు సైతం ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఆ మధ్య రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎంపిక అయ్యిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు దిల్ రాజు టీం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. ఎల్లమ్మ పోస్టర్‌తో హీరోయిన్ పోస్టర్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హీరోయిన్ విషయంలో చాలా సస్పెన్స్‌ను వేణు అండ్ టీం మెయింటెన్ చేయడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ కు సెట్ అయ్యే హీరోయిన్ ఎవరా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా...
సాయి పల్లవి ఇప్పటికే దిల్ రాజు బ్యానర్‌లో సినిమాలు చేసిన విషయం తెల్సిందే. అందుకే ఆమెతో మరో ఈ సినిమాలో దిల్ రాజు నటింపజేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ సాయి పల్లవి కోసం కనీసం ప్రయత్నాలు కూడా చేయలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సాయి పల్లవి పారితోషికం ఎక్కువ కనుక బడ్జెట్ పరిమితి దాటుతుందని భావిస్తున్నారట. అందుకే సాయి పల్లవి కాకుండా కోటి రూపాయల పారితోషికం లోపు ఉండే హీరోయిన్‌ను ఎల్లమ్మ మూవీ కోసం హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అదే నిజం అయితే కచ్చితంగా రుక్మిణి వసంత్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దేవి శ్రీ వంటి సీనియర్ కు జోడీగా నటించాలంటే మినిమం ఏజ్ ఉండాలి అనేది టీం మెంబర్స్ ఆలోచన. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతోంది.
రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా ఎల్లమ్మ..
ఎల్లమ్మ మూవీ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే నటీనటుల ఎంపిక పూర్తి చేశారని అంటున్నారు. హీరోయిన్ ఎంపిక సైతం దాదాపుగా పూర్తి అయ్యి ఉంటుంది. అయినా కూడా మేకర్స్ సస్పెన్స్‌ను కొనసాగిస్తూ వస్తున్నారు. హీరో విషయంలో దాదాపు ఆరు నెలల పాటు అదుగో.. ఇదుగో అంటూ చాలా సస్పెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు హీరోయిన్ విషయంలోనూ అదే తంతు జరిగితే ఎలా అంటూ చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఎల్లమ్మ హీరోయిన్ విషయంలో ఇంత సస్పెన్స్ అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమా విషయమై చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు. పూర్తి నిర్ణయాధికారం ను దర్శకుడు వేణు కు ఇచ్చినట్లు ఆ మధ్య నిర్మాతలు చెప్పుకొచ్చారు. కనుక బడ్జెట్ లెక్కలు వేసుకుని వేణు ఈ సినిమాకు హీరోయిన్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఖరారు అయితే మరి ఎప్పటికి సస్పెన్స్ రివీల్ చేస్తారా అనేది చూడాలి.
