Begin typing your search above and press return to search.

58 సినిమాలు.. 12 మంది డైరెక్టర్లు.. దిల్ రాజు మాస్ రిప్లై!

టాలీవుడ్ లో జడ్జిమెంట్ కి మారుపేరు దిల్ రాజు. కథ వింటే సినిమా ఫలితం ఎలా ఉంటుందో చెప్పగలిగే అతికొద్ది మంది నిర్మాతల్లో ఆయన ఒకరు.

By:  M Prashanth   |   23 Dec 2025 1:12 PM IST
58 సినిమాలు.. 12 మంది డైరెక్టర్లు.. దిల్ రాజు మాస్ రిప్లై!
X

టాలీవుడ్ లో జడ్జిమెంట్ కి మారుపేరు దిల్ రాజు. కథ వింటే సినిమా ఫలితం ఎలా ఉంటుందో చెప్పగలిగే అతికొద్ది మంది నిర్మాతల్లో ఆయన ఒకరు. అలాంటిది విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న 'రౌడీ జనార్ధన' సినిమా విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్ లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా దిల్ రాజు చాలా కాలిక్యులేటెడ్ గా ఉంటారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసినా బడ్జెట్ విషయంలో ఒక లిమిట్ పాటిస్తారు. కానీ ఈ సినిమాకు మాత్రం హద్దులు లేకుండా ఖర్చు చేస్తున్నారనే టాక్ వైరల్ అయ్యింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. "డైరెక్టర్ కొత్త, బడ్జెట్ ఏమో భారీగా ఉంది.. అన్నీ చూసుకునే చేస్తున్నారా?" అని ఒక జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనికి దిల్ రాజు కొంచెం సీరియస్ గానే, తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

దిల్ రాజు తన అనుభవాన్ని గుర్తుచేస్తూ ఆ ప్రశ్నకు చెక్ పెట్టారు. "58 సినిమాలు తీసి, 12 మంది డైరెక్టర్లని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన నాకు ఆ మాత్రం తెలియదా?" అని స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. ఈ ఒక్క మాటతో అక్కడ చప్పట్లు మారుమోగిపోయాయి. తన జడ్జిమెంట్ మీద తనకు ఎంత నమ్మకం ఉందో ఈ సమాధానంతో క్లారిటీ ఇచ్చారు.

అయితే ఇక్కడే ఆయన మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. తన కెరీర్ లో ఇంతవరకు ఏ కొత్త డైరెక్టర్ సినిమాకు కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టలేదట. గతంలో కూడా తనను ఇలాగే చాలామంది ప్రశ్నించారని, కానీ తాను కంటెంట్ ని నమ్మి ముందడుగు వేస్తానని క్లారిటీ ఇచ్చారు. అంటే రవికిరణ్ కోలా చెప్పిన కథలో అంత దమ్ము ఉందని దిల్ రాజు బలంగా నమ్ముతున్నారు.

విజయ్ దేవరకొండ స్టార్ డమ్, రవికిరణ్ కోలా టేకింగ్ మీద నమ్మకంతోనే ఈ రిస్క్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. కేవలం పేరు కోసమో, హంగుల కోసమో కాకుండా.. కథ డిమాండ్ మేరకే ఈ ఖర్చు పెడుతున్నామని దిల్ రాజు చెప్పకనే చెప్పారు. ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఇలాంటి కాన్ఫిడెన్స్ చూపిస్తే, అది సినిమాకు పాజిటివ్ బజ్ తీసుకొస్తుంది. ఇక 'రౌడీ జనార్ధన' వెనుక దిల్ రాజు మాస్టర్ ప్లాన్ ఏదో గట్టిగానే ఉన్నట్లుంది. 58 సినిమాల అనుభవం ఊరికే పోదు కదా. 2026 డిసెంబర్లో రాబోయే ఈ సినిమా, దిల్ రాజు జడ్జిమెంట్ ని మరోసారి ప్రూవ్ చేస్తుందో లేదో చూడాలి.