Begin typing your search above and press return to search.

నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ ప్లాన్ ఎలా ఉందంటే?

దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారట! ఇప్పటికే ఆయన తెలుగులో రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

By:  M Prashanth   |   24 Jan 2026 1:46 PM IST
నిర్మాత దిల్ రాజు.. బాలీవుడ్ ప్లాన్ ఎలా ఉందంటే?
X

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన దిల్‌ రాజు.. ఇప్పుడు బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో నిర్మాతగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన.. ఇటీవల మాత్రం వివిధ చిత్రాలతో నిరాశ ఎదుర్కొన్నారు. కానీ మళ్లీ తన స్పేస్ ను సొంతం చేసుకునేందుకు భారీ ప్లాన్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే ఆయన పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో రూపొందుతున్న రౌడీ జనార్దన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదే సమయంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్ లో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాకూ దిల్‌ రాజే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఆ రెండింటితోపాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అవి సెట్స్‌ పైకి వెళ్లనున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బీటౌన్ లో ఆయన చేసిన పలు ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. జెర్సీ, హిట్ చిత్రాల హిందీ రీమేక్‌ లు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న దిల్ రాజు.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారట! ఇప్పటికే ఆయన తెలుగులో రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని వినికిడి. దర్శకుడిగా అనీస్ బజ్మీ వ్యవహరిస్తున్నారని సమాచారం.

అక్షయ్ కుమార్‌ కు దిల్‌ రాజు చాలా ఏళ్ల క్రితమే అడ్వాన్స్ చెల్లించారని, అందుకే రీమేక్‌ కు ఆయన ఓకే చెప్పారని సమాచారం. స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారట. అదే సమయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్‌ లో స్ట్రయిట్ హిందీ సినిమా చేయాలని ట్రై చేస్తున్నారు. గతంలో ఆమిర్ ఖాన్‌ తో కలిసి దాదాపు ఏడాది పాటు ప్రాజెక్ట్‌ పై చర్చలు జరిగినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా వంశీ, సల్మాన్ తో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్‌ ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఆ ప్రాజెక్ట్‌ ను దిల్‌ రాజే నిర్మించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇవే కాకుండా దిల్‌ రాజు మరో మూడు- నాలుగు హిందీ సినిమాలను లైనప్‌ లో పెట్టారని తెలుస్తోంది. బాలీవుడ్ నిర్మాతలతో కలిసి సంయుక్తంగా ప్రాజెక్టులు రూపొందించనున్నారని సమాచారం. త్వరలో వాటిపై అధికారిక ప్రకటనలు కూడా వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి హిందీ పరిశ్రమలో స్ట్రాంగ్ ప్లేస్ ను సంపాదించాలనే లక్ష్యంతో దిల్‌ రాజు ముందుకు సాగుతున్నట్లున్నారు!