'టాక్సిక్' రైట్స్ రాజు గారికే.. హిస్టారిక్ డీల్ సెట్ అయిందా?
అయితే కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.
By: M Prashanth | 6 Feb 2026 4:01 PM ISTస్టార్ హీరో యష్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే నెలల్లో వరల్డ్ వైడ్ గా.. గ్రాండ్ గా సినిమా విడుదల కానుంది.
అయితే కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మేకర్స్ ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై ఉన్న అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో మూవీకి పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో టాక్సిక్ రూపొందుతుండగా.. కొన్ని గంటలుగా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులకు సంబంధించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్.. రూ.40 కోట్ల అడ్వాన్స్ రూపంలో సొంతం చేసుకుందని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు టాక్సిక్ మూవీ తెలుగు రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూషన్ ద్వారా పెద్ద ఎత్తున సినిమా రిలీజ్ చేయనున్నారు.
అయితే తెలుగు రైట్స్ విషయంలో ఇండస్ట్రీలోనే హిస్టారిక్ డీల్ ఖరారు అయిందని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రూ.120 కోట్లకు దిల్ రాజు.. టాక్సిక్ హక్కులను దక్కించుకున్నారని తెలుస్తోంది. దీంతో అది తెలిసినా నెటిజన్లు, సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. అన్ని కోట్లా అంటూ కొందరు మూవీ లవర్స్ నోరెళ్ళబెడుతున్నారు. యష్ క్రేజ్ అలా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఎలాంటి వాసుల్లో సాధిస్తుందో చూడాలని అంటున్నారు.
నిజానికి.. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు యష్. తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ 2 తెలుగులో భారీ హిట్ గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసుకుని పెద్ద ఎత్తున లాభాలు సంపాదించింది. కాసుల వర్షం కురిపించింది. అందుకే ఇప్పుడు టాక్సిక్ పై దిల్ రాజు భారీ పెట్టుబడి పెట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే రూ. 120 కోట్ల డీల్ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ మార్కెట్ లో ఆ రేంజ్ లో థియేటర్లు హక్కులు అమ్ముడవ్వడం చాలా అరుదు. అందుకే ఆ స్థాయి డీల్ బ్రేక్ ఈవెన్ కావాలంటే సినిమా భారీ కలెక్షన్లు సాధించాల్సి ఉంది. సినిమాకు కంప్లీట్ పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. మరి తెలుగులో టాక్సిక్ మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
