Begin typing your search above and press return to search.

అఖండ 2 కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్..?

బాలకృష్ణ బోయపాటి సినిమా అంటేనే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ఈ కాంబో ఎప్పుడు కృషి చేస్తున్నారు.

By:  Ramesh Boddu   |   22 Nov 2025 11:46 AM IST
అఖండ 2 కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్..?
X

బాలకృష్ణ బోయపాటి సినిమా అంటేనే సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు ఈ కాంబో ఎప్పుడు కృషి చేస్తున్నారు. ఐతే ఈసారి అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవం తో ఈ ఇద్దరు వస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కి సూపర్ హై ఇస్తుంది. బాలయ్య మరోసారి తన ఉగ్రరూపం తో ఊగిపోయేలా చేస్తున్నాడు. అఖండ 2 సినిమా ఈసారి పాన్ ఇండియా రిలీజ్ ఫిక్స్ చేశారు. అందుకే సినిమా ప్రమోషన్స్ ని ముంబై నుంచి మొదలు పెట్టారు మేకర్స్.

అఖండ 2 కోసం థమన్ మ్యూజిక్ తాండవం..

అఖండ తో మ్యూజిక్ అదరగొట్టిన థమన్ అఖండ 2 తాండవం కోసం మరోసారి స్పీకర్లు బ్లాస్ట్ అయ్యే ప్లాన్ చేశాడని తెలుస్తుంది. అఖండ 2 సినిమాను నైజాం రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. అఖండ సినిమాను ఆయనే రిలీజ్ చేసి మంచి లాభాలు పొందారు. అందుకే అఖండ 2 ని భారీ ధరకే నైజాం రైట్స్ కొనేసినట్టు తెలుస్తుంది.

ఐతే అఖండ 2 సినిమా కోసం దిల్ రాజు మాస్టర్ ప్లాన్ చేస్తున్నారట. ఎఫ్.డి.సీ చైర్మన్ గా ఉన్న ఆయన అఖండ 2 కోసం స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు వారం పాటు టికెట్ రేటు పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదన ఉంచుతున్నారట. తను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాకు ఇలాంటి వెసులుబాటు కల్పించేలా చూస్తున్నారు.

టికెట్ రేట్ల విషయంలో తెలంగాణా ప్రభుత్వం..

తెలంగాణా ప్రభుత్వం ఇదివరకే టికెట్ రేట్ల విషయంలో ఒక నిర్ణయం వెల్లడించింది. సినిమాటోగ్రఫీ మిస్టర్ కూడా ఇక మీదట తెలంగాణాలో టికెట్ రేట్లు పెంచడం కుదరదని చెప్పారు. మరి అఖండ 2 కోసం దిల్ రాజు తెలంగాణా ప్రభుత్వం నుంచి ప్రైజ్ హైక్ జీవో తెచ్చుకుంటారా లేదా రెగ్యులర్ ప్రైజ్ తోనే సినిమా రిలీజ్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. డిసెంబర్ 5న అఖండ 2 రిలీజ్ అవుతుండగా 4రోజు రాత్రి పెయిడ్ ప్రీమియర్ ఏర్పాట్లు చేస్తున్నారట.

నైజాం లో అఖండ 2 భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. ఐతే పోటీగా స్టార్ సినిమాలు లేకపోవడం వల్ల అఖండ 2 కి కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ ఈ సినిమాలో నటించింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట అఖండ 2 సినిమా నిర్మించారు. అఖండ 2 తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథతో వస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్య మహారాజుగా కనిపిస్తారని తెలుస్తుంది.గోపీచంద్ సినిమాతో పాటుగా బాలయ్య ఆదిత్య 999 సినిమా ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఆ సినిమాతోనే నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని తెలుస్తుంది.