దిల్‌రాజు- నాగవంశీ మధ్య ఏమైంది?
టాలీవుడ్‌లో నిర్మాతల మధ్య ఉన్న సంబంధాలు చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుబంధాలకంటే వ్యాపార వ్యూహాల ఆధారంగానే మారుతూ ఉంటాయి.
By: Sravani Lakshmi Srungarapu | 14 Aug 2026 11:51 AM ISTటాలీవుడ్‌లో నిర్మాతల మధ్య ఉన్న సంబంధాలు చాలా సందర్భాల్లో వ్యక్తిగత అనుబంధాలకంటే వ్యాపార వ్యూహాల ఆధారంగానే మారుతూ ఉంటాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న డిస్కషన్స్ లో ఒకటి దిల్‌రాజు, ఎస్. నాగవంశీ మధ్య మారుతున్న డిస్ట్రిబ్యూషన్ సమీకరణాల గురించే. ఒకప్పుడు నైజాం ప్రాంతంలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాలను దిల్‌రాజునే తీసుకునేవారు. ఆ బాండింగ్ సంవత్సరాల పాటు కంటిన్యూ అవడం వల్ల అది కేవలం వ్యాపార భాగస్వామ్యంగా కాకుండా పరస్పర నమ్మకానికి నిదర్శనంగా కూడా కనిపించేది.
నాగవంశీ కూడా గతంలో దిల్‌రాజు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని, ఆయన పని తీరును గౌరవిస్తానని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్నాయనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా తన రాబోయే సినిమాల డిస్ట్రిబ్యూషన్ విషయంలో నాగవంశీ కొత్త భాగస్వామ్యాలను పరిశీలిస్తున్నారనే ప్రచారం ఆ డిస్కషన్ కు మరింత ఊతమిచ్చింది.
ఇది పర్సనల్ డిస్టెన్సా లేక బిజినెస్ డెసిషనా అనే దానికి ఇప్పటివరకు క్లియర్ ఆన్సర్ లేదు కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నేటి నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో మరింత ఇండిపెండెంట్ గా వ్యవహరించాలనే ధోరణి చూపిస్తున్నారు. ప్రాంతాల వారీగా వేర్వేరు భాగస్వాములతో పనిచేయడం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డీల్స్ సెట్స్ చేసుకోవడం, రిస్క్‌ను డివైడ్ చేయడం వంటి అంశాలు కొత్త స్ట్రాటజీలో భాగమవుతున్నాయి.
ఇలాంటి టైమ్ లో వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం నైజాం హక్కుల కోసం దిల్‌రాజు ఆసక్తి చూపుతున్నారనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది. హారికా అండ్ హాసిని బ్యానర్‌తో ఆయనకు ఉన్న పాత అనుబంధం దృష్ట్యా ఈ సినిమా హక్కులను దక్కించుకోవడం ఆయనకు బిజినెస్ పరంగానే కాకుండా ప్రతిష్టాత్మకంగా కూడా మారినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఏళ్ల తరబడి కలిసి పనిచేసిన భాగస్వామ్యాలు ఇండస్ట్రీలో అరుదేమీ కాదు. కానీ మార్కెట్ మారినప్పుడు స్ట్రాటజీలు కూడా మారడం సహజమే. అందుకే దిల్‌రాజు- నాగవంశీ ఈక్వేషన్‌ను కేవలం విభేదాల కోణంలో కాకుండా, టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న కొత్త ఆలోచనల ప్రతిబింబంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆదర్శ కుటుంబం రైట్స్ వ్యవహారం ఎటు తేలుతుందన్నది ఒక సినిమా బిజినెస్‌కు సంబంధించిన అంశమే అయినప్పటికీ, దాని వెనుక టాలీవుడ్‌లో మారుతున్న వ్యాపార సంబంధాల కథ కూడా దాగి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
