Begin typing your search above and press return to search.

దిల్ రాజు@6.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని మెప్పించిన ఆయనకు రీసెంట్ గా వరుసగా ఫ్లాప్స్ షాక్ ఇచ్చాయి.

By:  M Prashanth   |   30 Nov 2025 9:00 PM IST
దిల్ రాజు@6.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!
X

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని మెప్పించిన ఆయనకు రీసెంట్ గా వరుసగా ఫ్లాప్స్ షాక్ ఇచ్చాయి. 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ను తీసుకొచ్చిన దిల్ రాజు.. ఆ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు.

ఆ వెంటనే వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. దిల్ రాజు కాస్త సేఫ్ అయ్యారు. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన తమ్ముడు మూవీ కూడా నిరాశపరిచింది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఆ సినిమా హిట్ అవుతుందనుకుంటే.. ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దీంతో దిల్ రాజు ఇప్పుడు కమ్ బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

అంతే కాదు మళ్లీ ఫామ్ లోకి రావాలని సూపర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఏకంగా ఆరు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. ముందుగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటిస్తున్న రౌడీ జనార్ధన్ మూవీని రంగంలోకి దించనున్నారు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో నిర్మిస్తున్న ఆ సినిమా.. షూటింగ్ ఇప్పటికే మొదలైంది. 2026లో రిలీజ్ కానుంది.

ఆ తర్వాత ఎల్లమ్మ మూవీని రిలీజ్ చేయనున్నారు దిల్ రాజు. బలగంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వేణు ఎల్దండి తెరకెక్కించనున్న ఆ సినిమా.. త్వరలో మొదలు కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ లీడ్ రోల్ లో నటించనుండగా.. మరికొద్ది రోజుల్లో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ రానున్నాయి.

అయితే రౌడీ జనార్ధన, ఎల్లమ్మతోపాటు వారసుడు ఆశిష్ రెడ్డి కోసం రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టారని తెలుస్తోంది. ఇప్పటికే రౌడీ బాయ్స్, సెల్ఫిష్ చిత్రాల్లో నటించిన ఆశిష్ రెడ్డిని దిల్ రాజు.. హీరోగా రీ లాంఛ్ చేయనున్నారని సమాచారం. అందుకు సంబంధించిన పనులను ఇప్పటికే ఆయన మొదలుపెట్టేశారని సినీ వర్గాల్లో వినికిడి.

ఇక బాలీవుడ్ లో బడా ప్రాజెక్టులు రూపొందించాలని ఆసక్తితో దిల్ రాజు ఉన్నారని సమాచారం. అక్కడి స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ తో వేర్వేరుగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వారిద్దరే కాకుండా ఇతర ప్రాజెక్టులను కూడా రెడీ చేస్తున్నారని వినికిడి. మొత్తం మీద ప్రస్తుతానికి ఆరు సినిమాలను లైన్ లో పెట్టి భారీ ప్లాన్ తో ముందుకెళ్తున్నారని తెలుస్తోంది.