రిస్క్ తో హిట్ కొడితే మజానే వేరు.. దిల్ రాజు అదే చేయనున్నారా?
అయితే ఇటీవల కాలంలో ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 1 Jun 2026 6:00 PM ISTటాలీవుడ్ లో కథలపై నమ్మకంతో రిస్క్ తీసుకునే నిర్మాతల్లో దిల్ రాజు పేరు టాప్ లో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి, అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగిన ఆయన.. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. అయితే ఇటీవల కాలంలో ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడంతో.. స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అందులో భాగంగానే జటాయు అనే మైథలాజికల్ ఫాంటసీ ప్రాజెక్టుకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించనున్నట్లు సమాచారం. అయితే గత రెండేళ్లుగా ఆయన కథపై వర్క్ చేస్తున్నారట. నార్మల్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఫాంటసీ ఎలిమెంట్స్ తో సినిమాను రూపొందించే ప్రయత్నం జరుగుతోందని టాక్.
ఆ ప్రాజెక్టుకు హీరోగా మొదట విజయ్ దేవరకొండ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. అయితే డేట్స్ సమస్యల కారణంగా ఆయన జటాయు ప్రాజెక్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ ప్లేస్ లో యంగ్ హీరో రోషన్ మేకా పేరు వినిపిస్తోంది. శ్రీకాంత్ కొడుకైన రోషన్ ఇప్పటివరకు కొన్ని సినిమాలు చేసినప్పటికీ, కెరీర్ ను మరో రేంజ్ కు తీసుకెళ్లే భారీ విజయం మాత్రం ఇంకా దక్కలేదు. అలాంటి సమయంలో జటాయు వంటి భారీ చిత్రంలో అవకాశం రావడం ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ప్రాజెక్టుపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణం కథ కంటే కూడా ఇందులో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణకు మంచి స్టోరీలతో సినిమాలు తీసే దర్శకుడిగా పేరు ఉన్నప్పటికీ, ఆయన ఇటీవల తెరకెక్కించిన చిత్రాలు పెద్దగా ప్రభావం చూపలేదు. మరోవైపు రోషన్ ఇంకా స్టార్ మార్కెట్ సంపాదించుకునే స్టేజ్ లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మైథలాజికల్ ఫాంటసీ జానర్ లో భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించడం చిన్న విషయం కాదు.
అయినా కూడా కథపై ఉన్న నమ్మకంతో దిల్ రాజు ముందుకు వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొత్త దర్శకులు, కొత్త కథలపై నమ్మకం పెట్టుకుని విజయాలు సాధించిన అనుభవం ఆయనకు ఉంది. అందుకే ఈసారి కూడా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, తెలుగు ప్రేక్షకుల్లో ప్రస్తుతం మైథాలజీ, ఫాంటసీ కథలపై మంచి ఆసక్తి కనిపిస్తోంది.
విజువల్ గ్రాండియర్ తో పాటు స్ట్రాంగ్ స్టోరీ ఉంటే ఇలాంటి చిత్రాలకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. అందుకే జటాయు కూడా సరైన రేంజ్ లో తెరకెక్కితే ఆడియన్స్ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానప్పటికీ, దసరా తర్వాత షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు దర్శకుడికి హిట్ అవసరం.. మరోవైపు హీరోకు బ్రేక్ కావాలి.. ఇంకోవైపు నిర్మాతకు బ్లాక్ బస్టర్ కావాలి.. ఆ మూడు టార్గెట్స్ తో కూడిన ప్రాజెక్ట్ గా జటాయు మారుతోంది. అందుకే రిస్క్ మూవీ అయినప్పటికీ అదే రిస్క్ హిట్ గా మారితే వచ్చే మజా వేరని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
