Begin typing your search above and press return to search.

స‌ముద్రం ఎప్పుడూ సొంత ఇల్లు లాంటిది.. న‌టి వ్యాఖ్య‌లు వైర‌ల్‌!

ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇది ఎవ‌రూ ఊహించ‌ని అత్యంత ప్రశాంతమైన, సాహసోపేతమైన ఫ్యామిలీ హాలిడే అని దియా వ్యాఖ్యానించారు.

By:  Sivaji Kontham   |   23 Jun 2026 11:59 PM IST
స‌ముద్రం ఎప్పుడూ సొంత ఇల్లు లాంటిది.. న‌టి వ్యాఖ్య‌లు వైర‌ల్‌!
X

హైద‌రాబాదీ నటి, పర్యావరణ ప్రేమికురాలు దియా మీర్జా తన కుటుంబంతో కలిసి మాల్దీవులలో గడిపిన అందమైన హాలిడే మూవ్‌మెంట్స్‌ను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసారు. మాల్దీవులలోని ఒక‌ ప్రైవేట్ రిసార్ట్‌లో దియా మీర్జా తన భర్త, పిల్లలతో కలిసి ఈ ఆహ్లాదకరమైన విహారయాత్రను ఆస్వాధించారు.

ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇది ఎవ‌రూ ఊహించ‌ని అత్యంత ప్రశాంతమైన, సాహసోపేతమైన ఫ్యామిలీ హాలిడే అని దియా వ్యాఖ్యానించారు. హిందూ మహాసముద్రం బులుగు జిలుగు నీళ్ల‌పై తేలుతూ.. నీటి లోపల ఉన్న అద్భుతమైన జీవరాశిని చూడటం... స్నార్కెలింగ్, డ్రైవింగ్, స్విమ్మింగ్ చేయడం వంటివి తమకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయని రాసుకొచ్చారు. ప్రకృతితో.. ఒకరితో ఒకరు మళ్లీ కనెక్ట్ అవ్వడానికి ఈ సమయం ఎంతగానో ఉపయోగపడిందని ఆనందం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా పిల్లలు ప్రకృతి అందాలను చూసి ఆశ్చర్యపోయేలా.. కొత్త విషయాలను నేర్చుకునేలా అన్వేషించేలా ఈ ప్రయాణాన్ని ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారని దియా ఆనందంగా తెలిపారు. ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసిన ట్రావెల్ సంస్థకు.. తమకు అసాధారణమైన ఆతిథ్యం అందించిన రిసార్ట్ యాజమాన్యానికి.. ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న జహా, సంతోష్‌లకు దియా మీర్జా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సముద్రం ఎప్పుడూ నా సొంత ఇల్లులాగే అనిపిస్తుంది! అంటూ ఎమోషనల్ అయ్యారు.

దియా మీర్జా షేర్ చేసిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటోలపై నెటిజన్లు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. ఇన్‌క్రెడిబుల్ క్యాప్చర్స్.. బెస్ట్ ఫ్యామిలీ మూమెంట్స్... ఎవర్‌గ్రీన్ బ్యూటీ అంటూ దియా అందాన్ని, మాల్దీవుల లోకేషన్‌ను నెటిజన్లు కొనియాడారు. దియా మీర్జా కుమారుడు అవ్యాన్ ఫోటోలు చాలా క్యూట్‌గా ఉన్నాయంటూ మరికొందరు కామెంట్ చేశారు.

అయితే ఎప్పుడూ పర్యావరణం గురించి మాట్లాడే దియా మీర్జా ఇలాంటి లగ్జరీ ట్రిప్స్ లో చిల్ వేయ‌డంపై కొందరు నెటిజన్లు విమర్శలు కూడా గుప్పించారు. ``మీరు సముద్ర జీవరాశుల‌ను నాశనం చేస్తున్నారు`` అంటూ ఒకరు కామెంట్ చేయగా.... పురుషులపై గతంలో దియా చేసిన కొన్ని వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మరొకరు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. అయితే మెజారిటీ అభిమానులు మాత్రం ఈ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ దియా మీర్జా పోస్ట్‌ను లైకులతో ముంచెత్తుతున్నారు. దియా మీర్జా చివ‌రిసారిగా నాగార్జున న‌టించిన `వైల్డ్ డాగ్` సినిమాలో న‌టించారు. ప్ర‌స్తుతం సౌత్ లో ఈ భామకు సినిమా ఆఫ‌ర్లు ఆశించినంత‌గా లేవు. హిందీ చిత్ర‌సీమ‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని సినిమాల్లో న‌టించేందుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. దియా ప్ర‌స్తుతం `ఇక్కా` అనే సినిమాలో న‌టిస్తోంది.