బోల్డ్ రోల్ లో దియా మీర్జా సూటవుతుందా?
బాలీవుడ్ నటి దియా మీర్జా గురించి పరిచయం అసవరం లేదు. అమ్మడు అక్కడ చాలా సినిమాలు చేసింది.
By: Srikanth Kontham | 30 Oct 2025 12:00 AM ISTబాలీవుడ్ నటి దియా మీర్జా గురించి పరిచయం అసవరం లేదు. అమ్మడు అక్కడ చాలా సినిమాలు చేసింది. తమిళ్, బెంగాలీ పరిశ్రమలోనూ పని చేసింది. కానీ హైదరాబాద్ నటి తెలుగులో మాత్రం పెద్ద స్టార్ కాలేకపోయింది. అమ్మడు పుట్టి పెరిగింది...చదువు అంతా హైదరాబాద్ లోనే. కానీ కుటుంబంతో ముంబై కి షిప్ట్ అయిన తర్వాత ముంబై స్వస్థలంగా మారింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కెరీర్ ప్రారంభమైన రెండు దశాబ్దాలకు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన `ది వైల్డ్ డాగ్` తో ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ఎంట్రీ సమయంలోనే టాలీవుడ్ లోనూ సత్తా చాటాలి అన్న ఆసక్తిని వ్యక్తం చేసింది. `వైల్డ్ డాగ్` రిలీజ్ అనంతరం నటిగా మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. కానీ ఆ సినిమా వైఫల్యం చెందడంతో దియా మీర్జా అనుకున్నంతగా తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు. కొత్త అవకాశాలు రాలేదు. మళ్లీ యధావిధిగా హైదరాబాద్ లో బాలీవుడ్ లో బిజీ అయింది. అయితే `వైల్డ్ డాగ్` రిలీజ్ అనంతరం బాలీవుడ్ లో కూడా పెద్దగా సినిమాలు చేయలేదు. మూడు నాలుగు సినిమాలకే పరిమితమైంది. ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసుకుంటూ వచ్చింది.
అయితే అమ్మడికి నేరేటర్ గా పని చేసిన అనుభవం ఉండటంతో ఆ రకంగానూ కొన్ని సినిమాలకు పనిచేసింది. తాజాగా ఈ బ్యూటీకి ఇండో-జర్మన్ దర్శకుడితో పనిచేసే అవకాశం వచ్చింది. 'వన్స్ అగైన్' టైటిల్ తో దర్శకుడు కన్వాల్ సేథీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇదొక రొమాంటిక్ కంటెంట్ తో నిండిన చిత్రమని సమాచారం. ఇందులో రాహుల్ భట్ మెయిన్ లీడ్ పోషిస్తున్నాడు. పీమేల్ లీడ్ కి దియా మీర్జాను ఎంపిక చేసారు. ఇందులో దియా పాత్ర బోల్డ్ గా ఉంటుందని సమాచారం. రాహుల్ భట్ తో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని వార్తలొస్తున్నాయి.
అయితే దియా మీర్జా బోల్డ్ అటెంప్ట్ చేసింది తక్కువే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ దర్శకుడి ప్రాజెక్ట్ కి ఎంతవరకూ సెట్ అవుతుందో చూడాలి. 25 ఏళ్ల కెరీర్ లో 40కి పైగా సినిమాలు చేసింది. కానీ వాటిలో విజయాలు తక్కువ కావడంతో? అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. తన జనరేషన్ భామలు సినిమా అవకాశాలు రానప్పటికీ ఓటీటీలతో బిజీ అవుతున్నారు. దియా మీర్జా మాత్రం ఆ రకంగానూ ముందుకు వెళ్లలేకపోతుంది. మరి కొత్త సినిమా అలాంటి అవకాశాలకు బాట వేస్తుందేమో చూడాలి.
