దృశ్యం 3 వివాదం..అక్షయ్‌ఖన్నా ఆ మెలిక పెట్టాడా?
బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాస్తూ సరికొత్త చరిత్ర దిశగా అడు
By: Ramesh Boddu | 29 Dec 2025 11:10 AM ISTబాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు తిరగరాస్తూ సరికొత్త చరిత్ర దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి టాక్ ఆఫ్ ద ఇండియాగా మారింది. రణ్‌వీర్‌సింగ్ నటన, ఆదిత్యధర్ టేకింగ్, డేరింగ్ స్టెప్, ఇండియాని కార్నర్ చేస్తూ పాక్ ఆడిన కుటిల రాజకీయం, టెర్రిరిస్టులని, గ్యాంగ్‌స్టర్లని, ఐఎస్ఐని వాడుకుని ఇండియాపై పాక్ ఎలాంటి కుట్రలు చేసిందనే విషయాలని `ధురంధర్` కళ్లకు కట్టినట్టు ప్రపంచానికి చూపించింది.
ఇదే ఈ మూవీని వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారేలా చేసింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఇందులో నటించిన అక్షయ్‌కన్నా మరింతగా వైరల్ అయ్యాడు. ఇందులో తను పోషించిన రహమాన్ డకాయత్ క్యారెక్టర్ అక్షయ్ ఖన్నాకు తిరుగులేని గుర్తింపుని, పాపులారిటీని తెచ్చి పెట్టింది. దీంతో అక్షయ్ బాలీవుడ్‌లో హాట్ ఫేవరేట్‌గా మారిపోయాడు. అంతే కాకుండా ఈ సినిమా కారణంగా ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది. అజయ్‌దేవగన్ ప్రధాన పాత్రలో `దృశ్యం3` రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ నుంచి అక్షయ్ తప్పుకోవడమే ఇప్పుడు వివాదానికి తెరతీసింది. `దృశ్యం 2`లో పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్న అక్షయ్‌ఖన్నా `దృశ్యం 3`లో నటించడంలేదు. ఇదే ఇప్పుడు అతన్ని వివాదంలోకి నెట్టింది. `ధురంధర్` రిలీజ్ ముందు వరకు ఈప్రాజెక్ట్‌లో భాగం అవుతానని మేకర్స్‌కి మాటిచ్చిన అక్షయ్ ఆ తరువాత తనకు ఏర్పిడిన క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముందు ఈ సినిమాలో నటించడానికి సుముఖత వ్యక్తం చేసి అగ్రిమెంట్ చేసుకున్న అక్షయ్ ఆ తరువాత పెద్ద మెలిక పెట్టి దాన్ని సాకుగా చూపించి తప్పుకున్నాడని ఇన్ సైడ్ టాక్.
ఆ మెలిక ఏంటంటే ప్రస్తుతం `ధురంధర్` సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న అక్షయ్ ఖన్నా ఈ మూవీ అందించిన క్రేజ్‌తో నటుడిగా మరింగా పాపులారిటీతో పాటు క్రేజ్ ఏర్పడటంతో దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో భాగంగా `దృశ్యం 3` కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ని డిమాండ్ చేశాడట. ఎంతగా అంటే ఇందులోని క్యారెక్టర్ కోసం ఏకంగా రూ.21 కోట్లు మేకర్స్‌ని డిమాండ్ చేశాడట. అంత పెద్ద మొత్తం ఇవ్వడం ఇష్టం లేక, సినిమా బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉండటంతో అందుకు నిరాకరించారట.
అదీన కాకుండా అక్షయ్ ఖన్నా `దృశ్యం 3`లో విగ్గు కావాల్సిందేని కూడా డిమాండ్ చేశాడ. `దృశ్యం 2`లో అక్షయ్‌కి ఎలాంటి విగ్గులేదు. పార్ట్ 3లో విగ్గు పెడితే కంటిన్యుటీ మిస్ అవుతుందని మేకర్స్ ఈ డిమాండ్‌ని కూడా రిజెక్ట్ చేశారట. ఈ రెండు కారణాల వల్లే అక్షయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుని తాను ఈ ఈ సినిమా చేయడం లేదని నిర్మాతకు చిన్న మెసేజ్ పెట్టి అప్పటి నుంచి వారికి టచ్‌లోకి రావడం లేదట. దీంతో మేకర్స్ అక్షయ్‌ఖన్నాపై లీగల్‌గా ప్రొసీడ్ కావాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
