'ధురంధర్' పార్ట్ 2 సాఫీగా రిలీజ్ అవుతుందా?
రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన `ధురంధర్` ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా నిలిచింది.
By: Tupaki Entertainment Desk | 29 Dec 2025 10:00 PM ISTఆదిత్యధర్ రూపొందించిన `ధురంధర్` ఇండియన్ సినిమాల్లో ఓ డేరింగ్, బోల్డ్ స్టెప్. కాందహార్ హైజాక్ నుంచి 26/11 అటాక్స్.. ల్యారీ నేపథ్యంలో పాక్ గ్యాంగ్‌స్టర్స్ చేస్తున్న వెపన్స్ స్మగ్లింగ్, దీనికి ఐఎస్ ఐ ఏజెంట్ ఇలియాస్ కశ్మీరీ, ఖనానీ బ్రదర్స్ తో పాటు వాంటెట్ టెర్రిరిస్ట్ గ్రూప్‌లు,గ్యాంగ్ స్టర్ సల్మాన్ డకాయత్‌తో కలిసి పన్నిన కుట్రలని పక్కా ఆధారాలతో బహిర్గతం చేసి యావత్ ప్రపంచ దేశాలని విస్మయానికి గురి చేసింది. టెర్రిరిజాన్ని, స్మగ్లర్స్‌ని, బలోచ్ లీడర్లని అడ్డంపెట్టుకుని పాక్ ఇండియాపై ఎలాంటి కుట్రలు చేసిందో ఇందులో చూపించారు.
రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన `ధురంధర్` ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా నిలిచింది. రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీపై రిలీజ్ తరువాత ఎన్నో విమర్శలొచ్చాయి. ప్రో ఇండియన్ గవర్నమెంట్ ఫిల్మ్ అని, యాంటీ పాకిస్థాన్ నరేటీవ్ అని ఇలా ఎవరికి వారు విమర్శలు చేస్తూ `ధురంధర్`ని, డైరెక్టర్ ఆదిత్యధర్‌ని టార్గెట్ చేశారు. అయినా సరే ఆ విమర్శలకు పూర్తి భిన్నంగా సాగుతూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతోంది.
ఫస్ట్ డే నుంచే ప్రభావాన్ని చూపిస్తూ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయిలో రూ.1100 కోట్లు రాబట్టి స్టడీగా రన్నవుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఐఎస్ ఐ ఏజెంట్ నుంచి పీఏపీ నేత, కాందహార్ హైజాక్ నుంచి 26/11 అటాక్స్.. ల్యారీ నేపథ్యంలో పాక్ గ్యాంగ్‌స్టర్స్, పార్లమెంట్‌పై దాడి వంటి విషయాలని ఓపెన్‌గా పార్ట్ 1లో చూపించారు. ఇక రివేంజ్ పేరుతో రాఏజెంట్ పాక్‌లో ఉన్న గ్యాంగ్ స్టర్స్, కీలక నేతలని లేపేసే సన్నివేశాలతో పూర్తి స్థాయి వైల్డ్ ఎలిమెంట్స్‌తో `ధురంధర్ పార్ట్ 2`ని రూపొందించారట.
పార్ట్ వన్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, ఇండియన్ సెక్యులర్ నేతలు, పలు యూట్యూబర్స్ సినిమాపై విషం చిమ్మిన నేపథ్యంలో ఫస్ట్ పార్ట్‌కి 50 రెట్లు హింసాత్మక సన్నివేశాలు, నమ్మలేని నిజాలతో సాటే `ధురంధర్ 2` రిలీజ్ అంత ఈజీగా అవుతుందా? అనే చర్చ జరుగుతోంది. నకిలీ నోట్లని ఇండియాలోకి ఐఎస్ ఐ ఎలా చేరవేస్తోంది. అసలు నోట్ల ప్రింటింగ్‌కు సంబంధించిన ప్లేట్లని దుబాయ్‌లో ఐఎస్ ఐ మేజర్ ఏజెంట్ ఇలియాస్, ఖనాని బ్రదర్స్‌కి ఇచ్చిన ఇండియన్ మినిస్టర్ ఎవరు? ..
బడేసాబ్‌గా పాక్‌లో చలామణి అవుతున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని రా ఫినిష్ చేయకుండా అడ్డుపడిన ఆ నాటి నేత ఎవరు?..ఈ క్రమంలో పాక్ గ్యాంగ్ స్టర్లని ఎలా అంతమొందించారు? వంటి సన్నివేశాలు, ఇండియన్ పొలిటికల్ లీడర్స్ సెక్యులరిజం ముసుగులో వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరుని `ధురంధర్ 2` ప్రశ్నించబోతూ వారి జీవితాల్ని బయటపెట్టబోతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ దుమారానికి ఆస్కారం ఉండటంతో `ధురంధర్ 2` రిలీజ్‌ని సెక్యులర్ వాదులుగా చెప్పుకునే నేతలు అడ్డుపడే అవకాశం ఉందనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే `ధురంధర్ 2`ని వచ్చే ఏడాది మార్చి 19న హిందీతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పటికే మేకర్స్ రిలీజ్ డేట్‌ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
