'ధురంధర్ 2' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్‌బంప్స్ అంతే!
ఇక భారత్‌లో ఒక్క హిందీ బెల్ట్ నుంచే ఫస్ట్ డే రూ.100 కోట్ల మార్కుని అవలీలగా దాటే అవకాశం ఉందని, మేకర్స్ కూడా ఇదే కోరుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
By: Ravindar Gorantla | 14 March 2026 1:29 PM ISTదేశ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట చీర్స్ టు `ధురంధర్`. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలై మిడిల్ ఈస్ట్‌లో బ్యాన్‌కు గురైనా కానీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్‌లో `ధురంధర్` సంచలనం సృష్టించింది. గత కొన్ని దశాబ్దాలుగా దాయాది దేశంతో కలిసి స్వదేశీ రాజకీయ నాయకులు ఎలాంటి కుట్రలకు తెరలేపారు?. నోట్ల రద్దుకు ఎలా కారణం అయ్యారు? తాజ్ మారణహోమంపై ఎంత ఊదాసీనంగా వ్యవహరించారనే షాకింగ్ విషయాలని కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఆశ్చర్యంతో పాటు షాక్‌కు గురి చేసిన `ధురంధర్` ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడమే కాకుండా సరికొత్త చర్చకు తెరలేపింది.
పాక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మనపై దొంగ చాటుగా దాడులకు పాల్పడుతోందంటే దానికి మన దేశంలో ఉన్న ఓ వర్గం రాజకీయ నాయకులే నని బల్లగుద్ది చెప్పింది. ఇలాంటి సంచలన మూవీ తరువాత దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ `ధురంధర్ ది రివేంజ్`. దీంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా అప్పుడే సూపర్ హిట్ టాక్ అనిపించుకుంటోంది. మరో నాలుగు రోజుల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో `ధురంధర్ ది రివేంజ్` ఉత్తర అమెరికాలో దాదాపు 15 మిలియన్‌ల డాలర్లని కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తోంది.
ఇక భారత్‌లో ఒక్క హిందీ బెల్ట్ నుంచే ఫస్ట్ డే రూ.100 కోట్ల మార్కుని అవలీలగా దాటే అవకాశం ఉందని, మేకర్స్ కూడా ఇదే కోరుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక దక్షిణాది వసూళ్లని కూడా కలుపుకుంటే ఈ ఫిగర్ రికార్డు స్థాయికి చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌కు థియేటర్లు దద్దరిల్లుతాయట. ఫస్ట్ పార్ట్‌లో భారీ యాక్షన్ బ్లాక్‌లు , బ్లాస్ట్‌లు అధికంగా ఉంటాయని, మరీ ముఖ్యంగా రెండు గంటల పాటు సాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
ఫస్ట్ పార్ట్ అంతా బ్లాస్టింగ్స్, యాక్షన్ ఎపిసోడ్సే కాకుండా కీలక మలుపులు, ట్విస్ట్‌లతో సాగుతుందని, రణ్‌వీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీగా కనిపించే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ బ్లాక్స్..హార్డ్ కోర్ మర్డర్స్‌తో సాగుతుందని, ఆ సీన్స్ చూస్తున్న ఆడియన్ రన్‌వీర్ లాగే ఫీలవుతూ ఎమోషన్‌కు గురవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో జస్కిరత్ సింగ్ రంగీ లైప్ ఏంటీ? తను ఎందుకు స్పైగా మారాడు? ..ఎందుకు ఈ ఆపరేషన్‌ని వ్యక్తిగత రివేంజ్‌గా ఎందుకు ఎంచుకున్నాడు? అతని జీవితంలో జరిగిన ఘోర సంఘటనలేంటీ? అన్నదే ఫస్ట్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చూపిస్తారట.
ఈ సీన్సే సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని, థియేటర్లు దద్దరిల్లిపోతాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌లో చాలా తక్కువే చూపించారని, అసలు స్టఫ్ అంతా సినిమాలో ఉందని తెలుస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్‌లో వచ్చే 2 గంటలు రణ్‌వీర్ సింగ్ ర్యాంపేజ్‌గా చెబుతున్నారు. అంటే `ధురంధర్ ది రివేంజ్`ని దర్శకుడు ఆదిత్యధర్ ఓ రేంజ్‌తో భయంకరంగా ప్లాన్ చేసినట్టుగా స్పష్టమవుతోంది. రన్ వీర్ స్వైర విహారాన్ని చూడాలంటే మరో నాలుగు రోజులు వేచి చూడాల్సిందే.
