'ధురంధర్ 2' వసూళ్ల సునామీ.. ఇప్పటివరకు ఎంతంటే?
ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ చిత్రం విడుదలైన నాటి నుంచి అద్భుతమైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది.
By: M Prashanth | 10 April 2026 4:22 PM ISTబాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని కొనసాగిస్తోంది. ఉగాది, రంజాన్ ఫెస్టివల్స్ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ చిత్రం విడుదలైన నాటి నుంచి అద్భుతమైన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది.
ధురంధర్ మొదటి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు గానే ధురంధర్ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్ మార్క్ లను సెట్ చేస్తోంది. ముఖ్యంగా దేశంలోనే రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్స్ దాటిన తొలి హిందీ సినిమాగా ధురంధర్ ది రివెంజ్ నిలవడం విశేషం.
మూడు వారాల సక్సెస్ ఫుల్ రన్ తర్వాత ధురంధర్ 2 ప్రపంచవ్యాప్తంగా రూ.1,680 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాలుగో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ సినిమా కలెక్షన్లు స్టేబుల్ గా కొనసాగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు రావడం ఆ చిత్రానికి ఉన్న భారీ డిమాండ్ ను స్పష్టంగా చూపిస్తోంది.
కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే... మొదటి వారం (8 రోజులు)లో రూ.690 కోట్లు వసూలు చేసిన ఆ సినిమా, రెండో వారంలో రూ.271 కోట్లు సాధించింది. మూడో వీకెండ్ లో రూ.80 కోట్లు రాబట్టగా, 19వ రోజు నుంచి 22వ రోజు వరకు రోజువారీగా రూ.11 కోట్లు, రూ.11 కోట్లు, రూ.10 కోట్లు, రూ.8 కోట్లు వసూలు చేసింది. దీంతో మూడో వారంలో మొత్తం రూ.120 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.
ఇప్పటివరకు దేశంలో నెట్ కలెక్షన్లు రూ.1081 కోట్లకు చేరుకోగా, గ్రాస్ కలెక్షన్లు రూ.1276 కోట్లుగా నమోదయ్యాయి. విదేశీ మార్కెట్ లో కూడా మూవీ దూసుకెళ్తూ రూ.404 కోట్ల వసూళ్లను సాధించింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా రూ.1,680 కోట్ల గ్రాస్ తో ధురంధర్ ది రివెంజ్ చిత్రం చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొదటి వారం మొత్తం (8 రోజులు)- రూ.690.00 కోట్లు
రెండో వారం మొత్తం- రూ.271 కోట్లు
మూడో వారం మొత్తం - రూ.120 కోట్లు
ఇండియా గ్రాస్- రూ.1,276 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ – రూ.404 కోట్లు
వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు- రూ.1,680 కోట్లు
ఇక సినిమా విషయానికొస్తే.. హీరోయిన్ గా సారా అర్జున్ నటించగా, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ వికాస్ నౌలఖ నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలు శివకుమార్ చేపట్టారు. సంగీతాన్ని శాశ్వత్ సచ్దేవ్ అందించారు. మరి ఫుల్ రన్ లో సినిమా ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి
