'ధురంధర్ 2': ఎలక్ట్రిఫైయింగ్ టైటిల్ ట్రాక్!
ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో తిరుగులేని రికార్డుని తన ఖాతాలో వేసుకోబోతోంది.
By: Ravindar Gorantla | 12 March 2026 3:24 PM ISTరణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన భారీ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ `ధురంధర్` ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. ఇప్పడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న `ధురంధర్: ది రివేంజ్` ఆ రికార్డుల్ని తిరగరాయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు ఇండియా వైడ్‌గా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సంచలనం సృష్టిస్తూ ట్రేడ్ వర్గాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
యంగ్ అండ్ డైనమిక్ రిలీక్ రైటర్ టర్న్‌డ్ డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ మూవీని అంతకు మించి అనే స్థాయిలో తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో ఫస్ట్ పార్ట్‌కు పూర్తి భిన్నంగా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ సర్వం సిద్ధం చేయడమే కాకుండా పెయిట్ ప్రీమియర్స్‌ని ఈ నెల 18న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగిన ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో తిరుగులేని రికార్డుని తన ఖాతాలో వేసుకోబోతోంది.
సినిమా రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో టీమ్ ప్రమోషన్స్‌ని ఫాస్టప్ చేసింది. ఇందులో భాగంగానే ఫస్ట్ సింగిల్‌గా` ఆరీ ఆయారీ..` అంటూ సాగే ఎలక్ట్రిఫైయింగ్ టైటిల్ ట్రాక్ హిందీ వెర్షన్‌ని గురువారం విడుదల చేసింది. ఇర్షాద్ కమిల్, బాంబే రాకర్స్, రిబెల్, టోకెన్ అందించిన ఈ లిరిక్స్‌కి శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించారు. రణ్‌వీర్ స్వైవిహారం నేపథ్యంలో సాగే ఈ పాట రోమాంచితంగా సాగుతూ ఆడియన్స్‌కి పూనకాలు తెప్పించేలా ఉంది. ప్రత్యర్థుల్ని ఒక్కొక్కరిగా రణ్‌వీర్ సింగ్ హతమారుస్తూ రహమాన్ డకాయత్ సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకునే క్రమంలో వచ్చే పాటగా దీన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది.
ఫస్ట్ పార్ట్‌లో సినిమా రన్ టైమ్ 3 గంటల 34 నిమిషాలు అయినా ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టలేదంటే దానికి ప్రధాన కారణం ఇందులో వచ్చే పాటలు, మ్యూజిక్. సెకండ్ పార్ట్ విషయంలోనూ దర్శకుడు ఆదిత్యధర్ ఇదే మ్యాజిక్‌ని ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే పార్ట్ 2 రన్ టైమ్ 3 గంటల 55 నిమషాలు అంటే ఫస్ట్ పార్ట్‌కు మించి అన్నమాట. దాదాపు నాలుగు గంటలు. ఇంత నిడివితో సినిమా అంటే ఆడియన్స్ థియేర్లలో కూర్చోవడం కష్టం. అయితే వారిని కూర్చోబెట్టాలంటే అందుకు తగ్గ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయాల్సిందే.
పార్ట్ 2 `ధురంధర్: ది రివేంజ్` విషయంలోనూ దర్శకుడు ఆదిత్యధర్ అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తున్నట్టుగా ఫస్ట్ సింగిల్ గా రిలిజ్ చేసిన `ఆరీ ఆరీ` సాంగ్‌తో స్పష్టమవుతోంది. ఇందులో రెమహాన్ డకాయత్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు దావూద్ ఇంబ్రహీంకు సంబంధించిన కీలక ఎపిసోడ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్‌తో భీభత్సం సృష్టించిన `ధురంధర్ ది రివేంజ్` రేపు థియేటర్లలో వరల్డ్ వైడ్‌గా ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
