Begin typing your search above and press return to search.

ధురంధర్ 2.. తెలుగులో ఇంతలా ఊహించలేదేమో!

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్: ది రివెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

By:  M Prashanth   |   22 March 2026 11:27 PM IST
ధురంధర్ 2.. తెలుగులో ఇంతలా ఊహించలేదేమో!
X

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ధురంధర్: ది రివెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది. స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ సినిమా రూ.500 కోట్ల క్లబ్‌ లోకి ఎంటర్ అవ్వడం విశేషం.

ముఖ్యంగా పెయిడ్ ప్రీమియర్స్‌ తో కలిపి ఆ చిత్రం ఇప్పటివరకు రూ.501.04 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం చర్చనీయాంశంగా మారింది. ధురంధర్ 2 కేవలం భారీ వసూళ్లతో కాకుండా, అత్యంత వేగంగా రూ.500 కోట్ల మార్క్‌ ను దాటిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. రణవీర్ సింగ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ తో మరోసారి ప్రేక్షకులను మెప్పించి, తన కెరీర్‌ లో మరో బ్లాక్‌ బస్టర్ హిట్‌ ను అందుకున్నారు.

యాక్షన్, ఎమోషన్, స్పై ఎలిమెంట్స్ రూపొందిన ఆ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో స్పందనను దక్కించుకోవడం విశేషం. అసలు ధురంధర్ మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో ఆ హిందీ వెర్షన్‌ కే మంచి ఆదరణ లభించింది. అదే కారణంగా సీక్వెల్‌ ను తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

అయితే కొన్ని సెన్సార్ సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ విడుదల కాస్త ఆలస్యమైంది. చివరకు మూవీ శనివారం తెలుగు వెర్షన్‌ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అన్ని థియేటర్స్‌ లో కూడా హౌస్‌ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా వీకెండ్ కావడంతో ప్రేక్షకులు భారీగా థియేటర్స్‌ కు చేరుకుంటున్నారు. ఆన్‌ లైన్ బుకింగ్స్ కూడా యమా జోష్ లో జరుగుతుండటంతో, సినిమా తెలుగు మార్కెట్‌ లో కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఈ స్థాయిలో స్పందిస్తారని మేకర్స్ కూడా ఊహించకపోవచ్చని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ముఖ్యంగా డబ్బింగ్ వెర్షన్‌ కు ఇంత భారీ రెస్పాన్స్ రావడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది చూస్తుంటే, మొదటి భాగాన్ని కూడా తెలుగులో విడుదల చేసి ఉంటే మరింత పెద్ద విజయాన్ని సాధించే అవకాశం ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికీ ఆలస్యమే అయినా, సీక్వెల్‌ ను తెలుగులో విడుదల చేయడం మాత్రం మేకర్స్‌ కు కలిసొచ్చిన నిర్ణయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే, భాష అనేది పెద్ద అడ్డంకి కాదని మరోసారి ఆ సినిమా నిరూపించింది. ఏదేమైనా ధురంధర్ 2 హిందీతో పాటు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటూ, పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఆ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో..