Begin typing your search above and press return to search.

ధురంధర్ 2.. వేరే ఎవరైనా అలా చేసేవారు కాదా..

అదే సమయంలో సినిమా నిర్మాణం, కథ, క్యారెక్టరైజేషన్ పై ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ కామెంట్ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

By:  M Prashanth   |   20 March 2026 7:53 PM IST
ధురంధర్ 2.. వేరే ఎవరైనా అలా చేసేవారు కాదా..
X

ధురంధర్: ది రివెంజ్.. కొన్ని రోజుల నుంచి ఎక్కడ చూసినా ఆ సినిమా కోసమే చర్చ నడుస్తోంది. గత ఏడాది వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ధురంధర్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఆ సినిమాపై ఆడియన్స్ తోపాటు అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్.. వాటిని మరింత పెంచిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇప్పుడు వాటిని అందుకుని థియేటర్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది ధురంధర్: ది రివెంజ్. మార్చి 19వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా.. ముందు రోజు ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ అందుకుని భారీ వసూళ్లు సాధిస్తోంది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో ఆ మూవీ కోసం జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

అదే సమయంలో సినిమా నిర్మాణం, కథ, క్యారెక్టరైజేషన్ పై ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఓ కామెంట్ ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఓ ప్రముఖ నిర్మాత చేసినట్లు చక్కర్లు కొడుతున్న ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ధురంధర్ సినిమా వేరే డైరెక్టర్, వేరే హీరో చేతిలో పడి ఉంటే పరిస్థితి పూర్తిగా మారిపోయేదంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు టాక్ వినిపిస్తోంది.

ఆ కామెంట్స్ నిజమా కాదా అన్నది స్పష్టత లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ గా షేర్ అవుతున్నాయి. ఆ నిర్మాత అభిప్రాయం ప్రకారం, మొదటి భాగం సక్సెస్ అయ్యాక చాలా సినిమాల్లో కనిపించే ట్రెండ్ ఇక్కడ కూడా జరిగేదని అంటున్నారు. అంటే, పార్ట్-1 హిట్ అయిన వెంటనే పార్ట్-2 కథను పూర్తిగా మార్చడం, మరింత పెద్ద స్థాయిలో తెరకెక్కించాలనే ఉద్దేశంతో అనవసరంగా బడ్జెట్ పెంచడం, వర్కింగ్ డేస్ లను లాగడం లాంటి విషయాలు జరిగేవని పేర్కొన్నట్లు సమాచారం.

ఇంకా ముఖ్యంగా, పార్ట్-1లో ప్రేక్షకులకు బాగా నచ్చిన పాత్రలను పార్ట్-2లో కూడా ఎలాగైనా కొనసాగించాలని ప్రయత్నించేవారని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా, తొలి భాగంలో కీలకంగా నిలిచిన అక్షయ్ రోల్ నా కథకు సరిపోకపోయినా కూడా ఎలాగో ఒక విధంగా ఇరికించే ప్రయత్నం జరిగేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం ధురంధర్ 2 విషయంలో మాత్రం అలాంటి ఫార్ములా ఫాలో కాలేదని, కథకు అవసరమైన మేరకు మాత్రమే పాత్రలు, సంఘటనలు తీసుకువచ్చారని నెటిజన్లు చెబుతున్నారు. ఇదే సినిమాకు ప్లస్ పాయింట్‌ గా మారిందని అంటున్నారు. చాలా మంది నెటిజన్లు, సినీ ప్రియులు.. ఆ కామెంట్స్ చేశారో లేదో పక్కన పెడితే.. వైరల్ అవుతున్న వాటిలో నిజమే ఉందని చెబుతున్నారు.

ధురంధర్ విషయంలో ఆదిత్య ధర్ చాలా కరెక్ట్ వేలో వెళ్లారని కొనియాడుతున్నారు. మరికొందరు అలా చేసేవారు కాదని అనలేమని, ఎవరి ప్లాన్ అండ్ టేకింగ్ వాళ్లదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, ధురంధర్ 2 విజయంతో పాటు, దాని చుట్టూ తిరుగుతున్న ఆ చర్చలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరి మీరు ఆ మూవీ చూశారా?