దీపిక పదుకునే ఆ బ్యాచ్‌లో కలిసిపోయిందా?
ఫస్ట్ పార్ట్ `ధురంధర్` సైలెంట్‌గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాపై జరుగుతున్న కుట్రలని అంతర్జాతీయ స్థాయిలో బహిర్గతం చేసి హాట్ టాపిక్‌గా మారింది.
By: Ravindar Gorantla | 21 March 2026 11:19 AM ISTదశాబ్దాల కాలంగా ఇండియాపై గుంటనక్క పాక్ పన్ను తున్న కుముక్తులు, ఉగ్రదాడులు, దాని వెనకున్న మత చాందసవాదులు, స్వదేశంలో ఉండి వారికి సహకరిస్తున్న సెక్యులర్ వాదుల గురించి యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా `ధురంధర్`. నోట్ల రద్దు వెనకున్న అసలు కారణాలని, దాని వెనుక జరిగిన భారీ కుట్రలతో పాటు అనేకీ కీలక విషయాలని వెల్లడిస్తూ రూపొందిన సీక్వెల్ `ధురంధర్ ది రివేంజ్`. ఇండియాపై పాక్‌లో జరుగుతున్న కుట్రలని ఛేందించే క్రమంలో ఇండియన్ రా ఏజెంట్ రహస్య ఆపరేషన్ కోసం వెళ్లి ఏం చేశాడు? ఎలా పాక్ కుట్రలని భగ్నం చేశాడనే కోణంలో దీన్ని తెరకెక్కించారు.
ఫస్ట్ పార్ట్ `ధురంధర్` సైలెంట్‌గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండియాపై జరుగుతున్న కుట్రలని అంతర్జాతీయ స్థాయిలో బహిర్గతం చేసి హాట్ టాపిక్‌గా మారింది. దీంతో పార్ట్ 2`ధురంధర్ ది రివేంజ్`పై అంచనాలు తారా స్థాయికి చేరాయి. భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలై `ధురంధర్ 2` ప్రీమియర్స్ నుంచే సంచలనాలు, రికార్డులు సృష్టించడం మొదలు పెట్టింది. తొలి రోజే రూ.240 కోట్ల మేర వసూళ్లని రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది.
దీంతో ఈ సినిమాపై సగటు సినీ లవర్స్, సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దక్షిణాదికి చెందిన క్రేజీ స్టార్లు సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పదిస్తుంటే బాలీవుడ్ నుంచి మాత్రం కేవలం ముగ్గురు ప్రీతిజింటా, అనన్యపాండే, కార్తిక్ ఆర్యన్‌లు మాత్రమే స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతకు మించి ఆశర్యం ఏంటంటే రణ్‌వీర్ సింగ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా అంతా ప్రశంసిస్తుంటే రణ్‌వీర్ వైఫ్, స్టార్ హీరోయిన్ దీపిక మాత్రం తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తండటం షాక్‌కు గురి చేస్తోంది.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `ధురంధర్` రిలీజ్‌కు ముందు కానీ, తరువాత కానీ దీపిక సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్‌ని షేర్ చేయలేదు. `ధురంధర్ 2` రిలీజ్ తరువాలైనా స్పందిస్తుంది అనుకుంటే పూర్తిగా సైలెంట్ అయిపోయి అసలు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రకాష్ రాజ్, కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ విధేయురాలు రమ్య ధురంధర్‌పై సోషల్ మీడియా వేదికగా తమ అక్కస్సుని వెళ్లగక్కుతుంటే దీపిక మాత్రం సైలెంట్‌గా ఉండి చోద్యం చూస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
దీంతో ధురంధర్ కారణంగా రణ్‌వీర్, దీపికల మధ్య ఏం జరుగుతోంది? అనే చర్చ మొదలైంది. బాలీవుడ్ చాలా వరకు సెక్యులర్ వాదులకు చాలా కాలంగా సపోర్టర్స్‌గా ఉంటూ వస్తున్నారు. ఇండియాపై ప్రేమని నటిస్తూనే సెక్యులర్ ఇజం ముసుగులో ఇండియాపై విషం కక్కుతున్నారనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. చాలా మంది ప్రొడ్యూర్స్, డైరెక్టర్స్ ఇండియన్ సంస్కృతిని,భారతీయతను కించపరుస్తూ సినిమాలు తీస్తున్నారని, `ధురంధర్` లాంటి సినిమాలు వచ్చినప్పుడు మూకుమ్మడిగా సైలెంట్ అయిపోతున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇలాంటి వారికి ఆదిత్యధర్ రంకుమొగుడిలా మారి భారీ ఎఫెక్ట్ కలిగించే సినిమాలు తీస్తూ అందరి నోళ్లు మూయిస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. ఇదే సందర్భంలో దీపికపై కూడా మండిపడుతున్నారు. సౌత్ స్టార్స్ నెట్టింట ప్రశంసలు కురిపిస్తుంటే దీపిక ఎందుకు మౌనాన్ని పటిస్తోందని, ఎక్కడ అవకాశాలు పోతాయోనని స్పందిచకుండా మౌనం పాటిస్తోందా.. లేక సెక్యులర్ బ్యాచ్‌తో కలిసిపోయిందా? సెటైర్లు వేస్తున్నారు.
