గ్రాండ్ గా ముగించిన నయా స్టార్!
అంతకు ముందు నటించిన `సిర్కిస్`, `జయేషాభాయ్ జోర్డార్` లాంటి చిత్రాలు డిజాస్టర్లను నమోదు చేసాయి. ఇంకా ముందుకెళ్తే రణవీర్ కెరీర్ లో 100-150 -200 కోట్ల వసూళ్ల చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి.
By: Srikanth Kontham | 16 Dec 2025 6:00 PM ISTబాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ `ధురంధర్` విజయంతో గ్రాండ్ గా 2025ని ముగిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రణవీర్ సింగ్ కెరీర్ లో తొలి 500 కోట్ల క్లబ్ చిత్రం ఇదే కావడం విశేషం. ఇంత వరకూ రణవీర్ 500 కోట్ల క్లబ్ లో చేరలేదు. మూడేళ్ల క్రితం రిలీజ్ అయిన `రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ` చిత్రం 350 కోట్ల వసూళ్లను సాధించింది. అదే అతడి టాప్ గ్రాసర్. ఆ సినిమా 500 కోట్ల వసూళ్లను సాధిస్తుందని ప్రచారం జరిగింది కానీ సాధ్య పడలేదు.
అంతకు ముందు నటించిన `సిర్కిస్`, `జయేషాభాయ్ జోర్డార్` లాంటి చిత్రాలు డిజాస్టర్లను నమోదు చేసాయి. ఇంకా ముందుకెళ్తే రణవీర్ కెరీర్ లో 100-150 -200 కోట్ల వసూళ్ల చిత్రాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ రకంగా చూస్తే రణవీర్ సింగ్ కెరీర్ లో `ధురంధర్` ఎంత పెద్ద హిట్లో? చెప్పొచ్చు. అంతే కాదు ఈ ఏడాది కాలంలో బాలీవుడ్ స్టార్స్ లో ఎవరూ ఇంత పెద్ద విజయాన్ని నమోదు చేయలేదు. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు నటించిన చిత్రాలు రిలీజ్ అయ్యాయి గానీ...ఆశించిన ఫలితాలు సాధించలేదు. షారుక్ ఖాన్ నుంచి ఎలాంటి సినిమా రిలీజ్ అవ్వలేదు.
ఇంకొంత మంది స్టార్లు కథలు కుదరక నటించలేదు. హృతిక్ రోషన్ ఎంతో శ్రమించి `వార్ 2`ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు కానీ డిజాస్టర్ అయింది. అగ్ర హీరోల చిత్రాలకంటే మీడియం బడ్జెట్ హీరోలే మెరుగైన ఫలితాలు సాధించాయి. టైర్ వన్ స్టార్ల నుంచి రణవీర్ సింగ్ మాత్రమే బ్లాక్ బస్టర్ నమోదు చేయడంతో? బాలీవుడ్ కి ఊరటనిచ్చినట్లు అయింది. దీంతో రణవీర్ `ధురంధర్` పార్ట్ 2 రిలీజ్ విషయంలోనూ పెద్దగా గ్యాప్ తీసుకోలేదు. తొలి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి `ధురంధర్ 2` మార్చి లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వాస్తవానికి `ధురంధర్` ముగింపులో రిలీజ్ తేదీ ప్రకటించలేదు. టు బీ కంటున్యూ అని మాత్రమే వెల్లడించారు. దీంతో పార్ట్ 2 షూటింగ్ పూర్తిచేసి రిలీజ్ చేయడానికి ఎలా లేదన్నా? ఏడాదిన్నర సమయం పడుతుంద నుకున్నారంతా. కానీ పార్ట్ 2 చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉందని తాజా ప్రకటనతో తేలిపోయింది. షూటింగ్ పూర్తయినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పటికప్పుడు ముగించుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే `ధురంధర్ 2` మార్చి రిలీజ్ పై కాన్పిడెంట్ గా ఉన్నారు.
