Begin typing your search above and press return to search.

ధురంధర్ OTT వేళ.. 'సర్దార్' ట్రెండింగ్ లో ఎందుకు?

అయితే అదే పాటను.. సర్దార్ గబ్బర్ సింగ్ మేకర్స్ అప్పుడు వినియోగించారు. ఆ సినిమాలో క్లైమాక్స్ కన్నా ముందు కొన్ని సాంగ్స్ ప్లే అవుతాయన్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Feb 2026 4:00 PM IST
ధురంధర్ OTT వేళ.. సర్దార్ ట్రెండింగ్ లో ఎందుకు?
X

ధురంధర్.. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ మూవీ.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ధురంధర్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషల్లో నెట్‌ ఫ్లిక్స్‌ లో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో కేవలం హిందీలో విడుదలైన ఆ చిత్రం ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ధురంధర్ మూవీ కోసం జోరుగా చర్చ జరుగుతోంది. అనేక మంది మూవీ లవర్స్.. సినిమాపై పోస్టులు పెడుతున్నారు.

అలా ధురంధర ఓటీటీలోకి వచ్చిన వేళ.. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ట్రెండ్ అవుతోంది. పవన్ కెరీర్ లో గబ్బర్ సింగ్ మూవీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ రూపొందగా.. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించారు.

భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్.. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ట్రెండింగ్ లో ఉంది. ధురంధర్ ఓటీటీలోకి వస్తే.. పవన్ మూవీ ఎందుకు ట్రెండింగ్ లో ఉందని అనుకుంటున్నారా.. దానికి కారణం ఒక పాత పాటను రీమిక్స్ చేయడమే. నిజానికి.. దురంధ‌ర్ టైటిల్ సాంగ్‌ కోసం ఓ ఓల్డ్ సాంగ్ ను మేకర్స్ రీమిక్స్ చేసి యూజ్ చేశారు.

అయితే అదే పాటను.. సర్దార్ గబ్బర్ సింగ్ మేకర్స్ అప్పుడు వినియోగించారు. ఆ సినిమాలో క్లైమాక్స్ కన్నా ముందు కొన్ని సాంగ్స్ ప్లే అవుతాయన్న విషయం తెలిసిందే. వివిధ లాంగ్వేజెస్ కు చెందిన పాటతో మెడ్లీ ఉండగా.. రౌడీలతో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ లు చేస్తారు. అందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుందని చెప్పాలి.

ఇప్పుడు అందులో ఒక హిందీ సాంగ్ నే ధురంధర్ మేకర్స్ కూడా యూజ్ చేశారు. దీంతో ఓటీటీ రిలీజ్ వేళ.. సోషల్ మీడియాలో ఆ పాట ట్రెండింగ్ అవుతోంది. అప్పుడే పవన్ ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో సినిమాలో అదే సాంగ్ ను యూజ్ చేసినట్లు గుర్తు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తున్నారు. దీంతో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నేమ్ ట్రెండ్ అవుతోంది.