సిగ్గు, లజ్జా వదిలేసి పాకిస్తాన్ డిమాండ్!
దీంలో ల్యారీ ప్రాంత ప్రజలు తమకు 80 శాతం డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా నేపథ్యాన్ని సినిమా కథగా తీసుకున్నప్పుడు అందులో వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు.
By: Srikanth Kontham | 24 Dec 2025 1:00 AM ISTఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే 800 కోట్లకుపై గా వసూళ్లను సాధించింది. 1000 కోట్ల క్లబ్ల్ లోనూ చేరే చిత్రమవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలు తమకు ఆ సినిమా వసూళ్లలో వాటా ఉందంటూ వింత వాదనకు దిగారు. ఈ చిత్రం పాకిస్తాన్ లోని ల్యారీ ప్రాంతం నేపథ్యంలోనే కథ సాగుతుంది. అక్కడి వాతావరణాన్ని స్పృశిస్తూ థాయిలాండ్ లో ప్రత్యేకంగా సెట్లు వేసి షూటింగ్ చేసారు. చాప్టర్ల వైజ్ గా డివైడ్ చేసి దర్శకుడు ఆధిత్యధర్ చిత్రాన్ని ఎక్కువగా ల్యారీ వాతావరణంలోనే చేసారు.
దీంలో ల్యారీ ప్రాంత ప్రజలు తమకు 80 శాతం డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా నేపథ్యాన్ని సినిమా కథగా తీసుకున్నప్పుడు అందులో వాటా ఇవ్వాల్సిందే అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. తమ ప్రాంతాన్ని తప్పుగా చేసి చూపించారని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలు బ్యాన్ చేసాయి. మరి ల్యారీ ప్రాంత డబ్బులు డిమాండ్ చేయడం అన్నది న్యాయమైనా కొరికేనా? అంటే అదే చేస్తే గనుక ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు భారతీయ చిత్రాల నుంచి వాటాలు వెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి కథనైనా తీసుకుని సినిమా చేసే స్వేచ్ఛ దర్శక, రచయితలకు ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని కండీషన్స్ ఉంటాయి.
బయోపిక్ లాంటి చిత్రాలు చేసేటప్పుడు ఆ కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి. వాళ్ల నుంచి రైట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు డిమాండ్ చేయడం? అన్నది వాళ్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసుకుని తెరకెక్కించే విషయంలో కొన్ని రకాల అడ్డంకులు ఉన్న ప్పటికీ డబ్బు డిమాండ్ చేయడం అన్నది ఎక్కడా కనిపించదు. `ధురంధర్` విషయంలో ఆధిత్య ధర్ ల్యారీ ప్రాంతానికి చెందిన కొంత మంది గ్యాగ్ స్టర్ కథల్ని తీసుకున్నాడు అన్నది వాస్తవం. ప్రత్యేకించి రెహమాన్ బలూచీ అలియాస్ రెహమాన్ డకాయత్ ని ఎక్కువగా హైలైట్ చేసాడు.
వాళ్లతో పాటు ఇంకొంత మంది పాకిస్తాన్ గ్యాంగ్ స్టర్లను తీసుకున్నాడు. ఆయా కుటుంబాల నుంచి డబ్బు డిమాండ్ చేస్తే అర్దముండేది. కానీ ల్యారీ ప్రాంత ప్రజల నుంచి డిమాండ్ రావడం అన్నదే హాస్యాస్పదంగా ఉంది. మరి ఈ విషయంలో `ధురంధర్` నిర్మాతలు లోకేష్ ధర్, దేశ్ పాండే సహా ఆదిత్య ధర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
