పార్ట్ 1లో అక్షయ్..పార్ట్ 2లో అర్జున్!
ఎక్కడ చూసినా..ఏ నోట విన్నా `ధురంధర్`.. ధురంధర్.. అంతగా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతూ సరికొత్త చరిత్రకు నాందిపలుకుతోంది.
By: Ravindar Gorantla | 24 March 2026 7:00 AM ISTప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మూవీ `ధురంధర్ 2. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే రికార్డులను సృష్టించడం మొదలు పెట్టింది. ఫస్ట్ పార్ట్‌కున్న క్రేజ్ క్యారీ కావడంతో `ధురంధర్ 2` ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా..ఏ నోట విన్నా `ధురంధర్`.. ధురంధర్.. అంతగా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతూ సరికొత్త చరిత్రకు నాందిపలుకుతోంది.
ఇంతకు ముందు విడుదలైన `ధురంధర్`లో హీరో రణ్ వీర్ సింగ్ అయినా కానీ ప్రధాన పాత్రలో పోషించిన అక్షయ్ ఖన్నా హైలైట్ కావడం, అతనిపై నెట్టింట రీల్స్ ఓ రేంజ్‌లో వైరల్ కావడం తెలిసిందే. ల్యారీ మాఫియా కింగ్ రెహమాన్ డకాయత్ క్యారెక్టర్‌లో అక్షయ్ ఖన్నా ఓ రేంజ్‌లో అదరగొట్టాడు. దర్శకుడు ఆదిత్యధర్ అనుకున్న దానికి మించి నెక్స్ట్ లెవెల్లో క్యారెక్టర్‌ని రక్తికట్టించి రణ్ వీర్ సింగ్‌నే డామినేట్ చేశాడంటే ఏ స్థాయిలో రెహమాన్ డకాయత్ క్యారెక్టర్‌ని తనదైన స్వాగ్‌తో పండించడంతో ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్ డాయినేషన్ ఎక్కువగా కనిపించింది.
తన గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రణ్ వీర్ సింగ్ హీరో అయినా ఎక్కడా తన గురించి ఎవరూ మాట్లాడలేదు అంటే అక్షయ్ ఖన్నా రెహమాన్ క్యారెక్టర్‌తో ఎంత ఇంపాక్ట్ కలిగించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక సెకండ్ పార్ట్ ది రివేంజ్‌లో ప్రధాన విలన్‌గా కనిపించింది అర్జున్ రాంపాల్. మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్‌లో అర్జున్ రాంపాల్ కూడా ఏ మాత్రం తగ్గని స్థాయిలో తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. అయితే అక్షయ్ ఖన్నా తరహాలో రణ్‌వీర్ సింగ్‌ని డామినేట్ చేయలేకపోవడం గమనార్హం.
పార్ట్ 2 ది రివేంజ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రెహమాన్ డకాయత్‌ని చూపిస్తారని ప్రచారం జరిగింది. పార్ట్ 2లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అక్షయ్ మరోసారి తనదైన స్వాగ్‌తో ఆకట్టుకుంటాడని అంతా అనుకున్నారు కానీ ఎక్కడా అది కనిపించకపోవడం కొంత వరకు అక్షయ్ అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. పార్ట్ 2లో పెద్దగా అక్షయ్ ప్రస్థావన కనిపించలేదు. ఎక్కడో ఒక చోట గ్లింప్స్‌లా చూపించారే కానీ అక్షయ్ లైవ్ క్యారెక్టర్ ఎక్కడా చూపించే ప్రయత్నం చేయలేదు.
ఓవరాల్‌గా రెండు భాగాలని తీసుకుంటే పార్ట్ 1లో అక్షయ్ ఖన్నా తనదైన మార్కు హాలీవుడ్ రేంజ్ నటనతో, స్వాగ్‌తో ఆకట్టుకుంటే సెకండ్ పార్ట్‌లో మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ రక్తికట్టించాడు. కానీ రణ్వీర్ సింగ్‌ని మాత్రం బీట్‌చేయలేకపోయాడు. మార్చి 19న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే పలు రికార్డుల్ని అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఆరనున్న రోజుల్లో అత్యంత ఫాస్ట్‌గా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాగా మరో రికార్డుని తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతోంది. ఇదే తీరును కొనసాగిస్తే తక్కవ టైమ్‌లోనే రూ.2000 మార్కుని చేరుకోవడం ఏమంత పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
