15 ఏళ్ల కష్టం 'ధురంధర్'తో తీరింది!
సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఏళ్ల తరబడి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లూ ఉన్నారు.
By: Tupaki Entertainment Desk | 30 Dec 2025 9:00 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఏళ్ల తరబడి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లూ ఉన్నారు..రాత్రికి రాత్రే స్టార్లుగా మారి నేమ్‌ని, ఫేమ్‌ని సొంతం చేసుకుని లైమ్ లైట్‌లో వెలిగిపోయిన వాళ్లూ ఉన్నారు. అలా ఓ నటుడు గత 15 ఏళ్లుగా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అతని 15 ఏళ్ల కష్టాన్ని తీర్చి అతని జాతకాన్ని `ధురంధర్` మార్చేసింది. అతడే దినేష్ పాందోర్. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన సెన్సేషనల్ బాలీవుడ్ మూవీ `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది.
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. రానున్న రోజుల్లో మరిన్ని రికార్డుల్ని తిరగరాయడానికి బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా రన్నవుతోంది. దాయాది కంట్రీ పాకిస్థాన్ ఉగ్రవాదులని, ఐఎస్ ఐని, స్మగ్లర్లు, గ్యాంగ్‌స్టర్లని వాడుకుని ఇండియాపై ఎలాంటి కుట్రలు చేశారు?. ఉగ్రవాదుల్ని పంపించి ఎలాంటి దాడులకు తెగబడ్డారు?..వాటిని ఛేదించే క్రమంలో మన రా ఏజెంట్ ని రంగంలోకి దించి అండర్ కవర్ ఆపరేషన్‌ని ఎలా చేశారు? ఇండియాపై కుట్రలు చేస్తున్న వారిని ఎలా ఏరి వేశారు? అనే షాకింగ్ ఫ్యాక్ట్స్‌తో `ధురంధర్`ని తెరకెక్కించారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ హాట్ టాపిక్‌గా మారిన `ధురంధర్`లో రెహమాన్ డెకాయత్ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ క్యారెక్టర్‌కు సపోర్టర్‌గా డానిష్ పాందోర్ అనే నటుడు ఉజైర్ బలోచ్ క్యారెక్టర్‌లో నటించి ఆకట్టుకున్నాడు. 15 ఏళ్లుగా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న తన కష్టం `ధురంధర్`తో తీరిందని చెబుతున్నాడు. రీ సెంట్‌గా ఓ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. `ముఖేష్ ఛాబ్రా ఆఫీస్ నుంచి ఆడిషన్‌కి రమ్మని నాకో కాల్ వచ్చింది. ఆ టైమ్‌లో సినిమా ఏంటీ, డైరెక్టర్ ఎవరు?, నా క్యారెక్టర్ ఏంటీ? అనే విషయాలు నాకు తెలియదు.
ఆడిషన్‌కి వెళ్లిన తనకు ఎక్కడా ఈ విషయాన్ని చెప్పొదని స్ట్రిక్ట్‌గా చెప్పారట. కొన్ని వారాలు గడిచిన తరువాత ఈ ప్రాజెక్ట్‌లో నువ్వు నటిస్తున్నావని ఫోన్ చేశారు. ఆ తరువాత దర్శకుడు ఆదిత్యధర్‌ని కలిశాను. అప్పుడే తను నా క్యారెక్టర్ గురించి వివరించారు. క్యారెక్టర్ డైలాగ్ డెలివరీపై ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌తో పాటు వెపన్స్ ఎలా ఉపయోగించాలో కూడా నేర్పించారు. అలా `ధురంధర్`లో తాను భాగమయ్యాను. ఆరేళ్లు రీసెర్చ్ చేసి ఆదిత్యధర్ `ధురంధర్`ని వరల్డ్ ముందుకు తీసుకొచ్చాడని, సినిమా సాధిస్తున్న సక్సెస్‌ని చూసి థ్రిల్లింగ్‌గా ఉందని తెలిపాడు డానిష్ పాందోర్.
అంతే కాకుండా సినిమాలో తన క్యారెక్టర్‌ని చూసినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నాడు. వంద శాతం నా వంతు కష్టపడ్డానని, ఈ క్యారెక్టర్ పోషించడంలో దర్శకుడు ఆదిత్యధర్ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నాడు. ఈ సినిమా ఫలితంతో మంచి వాళ్లుకు ఎప్పుడూ మంచే జరుగుతుందని నిరూపించింది. ఈ విజయం చూసి నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. ఇన్నేళ్ల కష్టం ఇప్పటికి ఫలించడం నాకు దక్కిన రివార్డుగా భావిస్తున్నానని దినేష్ ఎమోషనల్ అయ్యాడు. పార్ట్ 2లో తన క్యారెక్టర్ మరింత పవర్‌ఫుల్‌గా సాగుతుందని ఆ రోజు కోసం వేయిట్ చేయలేకపోతున్నాని తెలిపాడు.
