డైరెక్టర్ ఆదిత్యధర్ వెనకున్న ఇంట్రెంస్టింగ్ స్టోరీ!
ఇంతటి సంచలనానికి కారకుడైన దర్శకుడు ఆదిత్యధర్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
By: Ravindar Gorantla | 24 March 2026 5:54 PM ISTప్రపంచం అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్న సినిమా `ధురంధర్ 2`. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ సినిమా మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. రాకెట్ స్పీడుతో రికార్డుల్ని అధిగమిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికే రూ.800 కోట్ల మార్కుని దాటిన ఈ సినిమా రానున్న రోజుల్లో రూ.1000 కోట్ల క్లబ్‌ని అవలీలగా దాటేసి సరికొత్త రికార్డుల దిశగా పయనించేలా కనిపిస్తోంది. ఇదే క్రేజ్‌ని కొనసాగిస్తే మాత్రం ఈ సినిమా లాంగ్ రన్‌లో అన్ బీటబుల్ ఫీట్‌గా చెబుతున్న రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
ఇంతటి సంచలనానికి కారకుడైన దర్శకుడు ఆదిత్యధర్ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. డైరెక్టర్ ఆదిత్యధర్ వెనుకున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటీ? ఇలాంటి సినిమానే చేయాలని తను ఎందుకు అనుకున్నాడు. దానికి బీజం ఎక్కడ పడింది? అసలు ఆదిత్యధర్ ఎవరు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదిత్యధర్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆదిత్యధర్ ఒక కశ్మీర్ పండిట్. కశ్మీర్ అల్లర్ల కారణంగా పండిట్‌లపై మారణహోమం జరిగింది.
ఆ అల్లర్ల కారణంగా ఆదిత్యధర్ కుటుంబాన్ని కశ్మీర్ నుండి వెళ్లగొట్టారట. ఆ కారణంగానే అతని కుటుంబం కశ్మీర్‌ని వీడి ఢిల్లీకి చేరింది. అతనికి వర్డ్ బ్లైండ్‌నెస్ ఉండేది.. అంటే త్వరగా చదవడం, అర్థం చేసుకోవడం వంటివి తను చేయలేడు. కాస్త స్లో అండ్ స్టడీ అన్నమాట. విషయాలని ఫాస్ట్‌గా కాకుండా నెమ్మదిగా అర్థం చేసుకోవడం అనే ఫోబియా ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆదిత్యధర్ సినిమాల్లో వర్క్ చేయాలని ముంబై చేరుకున్నాడట. తల్లి సునీత ధర్ మ్యూజిక్ థియేటర్‌ని రన్ చేయడంతో ఆదిత్యధర్‌కు మ్యూజిక్‌పై మంచి పట్టు ఏర్పడింది.
అదే అతన్ని `కాబూల్ ఎక్స్‌ప్రెస్` మూవీకి లిరిక్ రైటర్‌గా పరిచయం అయ్యేలా చేసింది. డైలాగ్ రైటర్‌గా ముందు వర్క్ చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడంతో లిరిక్ రైటర్‌గా వర్క్ చేశాడు. 2006 నుంచి లిరిక్ రైటర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన ఆదిత్యధర్ హాల్ ఏ దిల్, డాడీ కూల్, ఫిర్ వంటి సినిమాలకు సాంగ్స్ రాశాడు. మధ్యలో ఓ ప్రైవేట్ ఆల్బమ్‌కు సాంగ్స్ అందించిన ఆదిత్యధర్ ..దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిందించిర `ఆక్రోష్`తో డైలాగ్ రైటర్‌గా మారాడు. అదే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశాడు.
ఆ తరువాత కూడా ప్రియదర్శన్ చేసిన `తేజ్`కు కూడా డైలాగ్స్ అందించి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు కావాలిన రవీందర్ కౌశిక్ స్ఫూర్తితో ఓ కథని పూర్తి చేసి యష్ రాజ్ ఫిల్మ్స్‌కి వినిపిస్తే దాన్ని కాస్తా కబీర్‌ఖాన్‌కు ఇచ్చేయడంతో ఆదిత్యధర్‌కు క్రెడిట్ దక్కలేదట. ఆ తరువాత కూడా `మిల్కాసింగ్` బయోపిక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తే అది కూడా మరొకరికి చేతికి వెళ్లిందట. అలా ఆదిత్యధర్ చేసిన రెండు కథలు చేతులు మారి బ్లాక్ బస్టర్ హిట్‌లు అయ్యాయట. తనకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో బాధపడిన ఆదిత్యధర్ ఈ సారి ఎలాగైనా భారీ బ్లాక్ బస్టర్‌ని చేయాలని ప్రయత్నిస్తున్న టైమ్‌లో విక్కీ కౌశల్ నటించిన `మసాన్` చూసి అతన్ని దృష్టిలో పెట్టుకుని కథ రాశాడట.
అదే `ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్`. డైరెక్టర్‌గా, రైటర్‌గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి అందరి దృష్టిలో పడేలా చేసింది. ఆ తరువాత `ఆర్టికల్ 370`ని రాసి నిర్మించాడు. అది సూపర్ హిట్టే. దీని తరువాత ఏడు గంటల నిడివితో ఓ కథని సిద్ధం చేసుకున్నాడు. దానికి జీయో స్టూడియోస్ నిధులు సమకూరుస్తుందని వారిని సంప్రదిస్తే నిడివి చూసి భయపడి వారు చేతులెత్తేశారట. దీంతో తన సోదరుడు లోకేష్ ధర్‌ని కలుపుకుని ప్రొడ్యూస్ చేస్తామని చెప్పడంతో జీయో స్టూడియోస్ కూడా భాగస్వామి కావడానికి ముందుకొచ్చింది.. అలా మొదలైందే `ధురంధర్`. బాలీవుడ్ చేతిలో రెండు కథల విషయంలో మోసపోయిన ఆదిత్యధర్ ఇప్పుడు `ధురంధర్`తో సంచలనం సృష్టిస్తూ కీర్తించబడుతుండటం విశేషం.
