సింగిల్ లాగ్వెంజ్ అంటూ సౌత్ ని కెలకడమా?
సౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తా చాటాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి తెలుగు సినిమాలు బాలీవుడ్ హీరోల పేరిట రికార్డులనే తిరగరాసిన చిత్రాలున్నాయి.
By: Srikanth Kontham | 8 Jan 2026 8:00 PM ISTసౌత్ సినిమాలు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తా చాటాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి తెలుగు సినిమాలు బాలీవుడ్ హీరోల పేరిట రికార్డులనే తిరగరాసిన చిత్రాలున్నాయి. 'పుష్ప', 'సాహో', ,' కార్తికేయ 2' లాంటి చిత్రాలు నార్త్ మార్కెట్ లో అసాధారణ వసూళ్లతో రికార్డులు సృష్టించాయి. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలు తెలుగు రీజనల్ మార్కెట్ తర్వాత హిందీ నుంచే అత్యధిక వసూళ్లు సాధించాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా రిలీజ్ అనగానే ఆయా స్థానిక భాషల్లో అనువదించి రిలీజ్ చేసిన చిత్రాలు మాత్రమే.
'బాహుబలి' నుంచి తెలుగు సినిమా ఇదే పార్మెట్ లో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ప్రత్యేకించి 'పుష్ప' ప్రాంచైజీ బాలీవుడ్ మార్కెట్ లో భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. అంతకముందు రిలీజ్ అయిన 'కార్తికేయ 2' కూడా నార్త్ మార్కెట్ లో బాగా వర్కౌట్ అయింది. ఇంకా ముందుకెళ్తే ప్రభాస్ నటించిన 'సాహో' తెలుగులో ఫెయిలైనా హిందీలో మాత్రం మంచి వసూళ్లను సాధించింది. ప్రభాస్ ఇమేజ్ తో అక్కడా భారీ ఓపెనింగ్స్ దక్కాయి.
కన్నడ నుంచి రిలీజ్ అయిన 'కేజీఎఫ్' ప్రాంచైజీ కూడా బాలీవుడ్ లో మంచి వసూళ్లనే సాధించింది. ఈ వసూళ్లు చూసి బాలీవుడ్ విస్తుపోయేంది. పరభాషా చిత్రాలు నార్త్ మార్కెట్ లో ఈ స్థాయిలో విజయం సాధించడం ఏంటనే చర్చ జరిగింది. కథలో బలం, భావోద్వేగం ఎలా ఉండాలో? తెలుగు సినిమాలు...సౌత్ సినిమాలు చూసి నేర్చుకోవాలని అమీర్ ఖాన్, అమితా బచ్చన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్లు డైరెక్ట్ గానే బాలీవుడ్ కి సూచించారు. తమ కథలు ఎంత బలహీనంగానే ఉంటున్నాయని మన వైఫల్యాలే చెబుతున్నాయని హెచ్చరించారు.
పెద్ద సినిమా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద ఫెయిలైందంటే? ఇండస్ట్రీపై ఏదో రూపంలో అక్షింతలు తప్పేవి కాదు. తెలుగు సినిమా హిందీ మార్కెట్ లో సక్సెస్ అయిన తర్వాత బాలీవుడ్ లో తలెత్తిన పరిస్థితులివన్నీ. ఇటీవలే రిలీజ్ అయిన 'ధురంధర్' విజయంతో బాలీవుడ్ పేరు దేశమంతా మళ్లీ మారుమ్రోగుతోంది. ఇప్పటికే సినిమా 1200 కోట్ల వసూళ్లతో తెలుగు సినిమాల రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి సింగిల్ లాంగ్వేజ్ లోనే ఈ స్థాయిలో సత్తా చాటామంటూ అధికారికంగా ప్రకటించారు.
ప్రత్యేకంగా ఒకే భాషలో తమ సినిమా రిలీజ్ అయిందంటూ? జనాల్లోకి తీసుకెళ్లడంతో తెలుగు సహా సౌత్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతోంది. సౌత్ సినిమా సహా తెలుగు సినిమాలు దేశంలో అన్ని భాషల్లో రిలీజ్ అయిన సాధించిన వసూళ్లు తమ సినిమా మాత్రం ఒకే భాషలో రిలీజ్ అయి రికార్డులు సృష్టించింది? అన్న పాయింట్ ను బాలీవుడ్ హైలైట్ చేస్తుందా? సౌత్ సినిమాపై ప్రతీకార చర్య? అంటూ చర్చ జరుగుతోంది.
