చాలాకాలం తర్వాత... వీక్ డేస్ లో స్ట్రాంగ్
రన్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
By: Ramesh Palla | 10 Dec 2025 11:51 AM ISTరన్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ స్టార్ కాస్టింగ్ తో రూపొందిన దురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు ఓపెనింగ్స్ రాబడుతుందని అంతా భావించారు. ఈ మధ్యకాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాల మాదిరిగానే ఈ సినిమా గొప్పగా ఏమీ లేదు అంటూ చాలామంది విమర్శలు చేశారు. సినిమాకు నిడివి ఎక్కువ ఉండడం ఒక మైనస్ అయితే యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం మరో మైనస్ అంటూ రివ్యూ లు చెప్పిన వారు చాలామంది కామెంట్స్ చేశారు. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు అని నమోదు అవుతున్న కలెక్షన్స్ ని బట్టి చెప్పుకోవచ్చు. మొదటి రోజు కాస్త నీరసంగా నిరుత్సాహంగా అనిపించిన కలెక్షన్స్ రోజులు గడుస్తున్న కొద్ది భారీగా పెరుగుతూ పోతున్నాయి. సాధారణంగా వీక్ డేస్ లో కలెక్షన్స్ ఒక మోస్తరుగా నమోదు అయితే గొప్ప విషయం అంటారు కానీ ఈ సినిమాకు వీక్ డేస్ లో సాలిడ్ కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు చెబుతున్నారు. బుక్ మై షో నెంబర్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని స్వయంగా చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దురంధర్ కలెక్షన్స్...
భారీ స్టార్ కాస్టింగ్, సినిమా గురించి పాజిటివ్ పబ్లిసిటీ కారణంగా శుక్రవారం మొదటిరోజు కావడంతో బుక్ మై షో లో దాదాపుగా 3.76 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. ఇక రెండవ రోజు వీకెండ్ కావడంతో శనివారం 4.62 లక్షల టికెట్లు అమ్ముడు పోవడం విశేషం. మొదటి రెండు రోజులకే సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ కి చేరువ కావడంతో యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను పెంచారు. మూడవ రోజు అయిన ఆదివారం దాదాపుగా 5 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. ఆదివారం కలెక్షన్స్ తో కలుపుకొని దురంధర్ సినిమా రూ.100 కోట్ల మార్కుని క్రాస్ చేసింది. ఈ సంవత్సరం రూ.100 కోట్లు అంతకు మించి కలెక్షన్స్ రాబట్టడం పెద్ద సినిమాలకు కూడా కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడంతో ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. అంతేకాకుండా పాకిస్తాన్లో ఇండియన్ స్పై ఏజెంట్ నిర్వహించిన పై ఆపరేషన్ గురించి ప్రముఖంగా కథనాలు వినిపిస్తున్నాయి. నిజ జీవిత పాత్రలను సినిమాలో చూపించడం ద్వారా కూడా ప్రముఖంగా చర్చ జరిగే విధంగా దర్శకుడు ఆదిత్య దర్ చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్
మొదటి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టిన దురంధర్ సినిమా వీక్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందా అని అంత ఆసక్తిగా ఎదురు చూశారు. సోమవారం అంతా అనుకున్నట్లుగానే కాస్త కలెక్షన్స్ తగ్గాయి, సోమవారం సినిమా చూసేందుకు బుక్ మై షో లో దాదాపుగా 3.75 లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. సాధారణంగా అయితే తర్వాత రోజు అంటే మంగళవారం బుకింగ్ మరింతగా తగ్గాలి, కలెక్షన్స్ నెంబర్స్ సోమవారంతో పోలిస్తే మరింతగా తగ్గాలి. కానీ ఆశ్చర్యకరంగా సోమవారంతో పోలిస్తే దాదాపుగా 35,000 మంది అదనంగా సినిమాలు చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్స్ ని బుక్ చేసుకోవడం జరిగింది. 4.10 లక్షల మంది బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేసుకుని సినిమాను చూసినట్లుగా రికార్డు నమోదయింది. ఈ మధ్యకాలంలో వీక్ డేస్ లో ఈ స్థాయి బుకింగ్స్ నమోదు కాలేదని బాక్సాఫీస్ వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు. వీకెండ్ నెంబర్ తో పోలిస్తే వీక్ డేస్ నెంబర్స్ ఎక్కువగా నమోదు కావడం కచ్చితంగా సినిమాకి దక్కిన హిట్ టాక్ కారణం అంటున్నారు.
ఇండియన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్
భారత స్పై ఏజెంట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను చూపించారు అంటూ మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. కానీ దర్శకుడు ఆదిత్య ధర్ సినిమాకి ఆయన జీవితానికి ఎలాంటి సంబంధం లేదు అని చెబుతూ వచ్చారు. కానీ సినిమాలో చూసిన తర్వాత చాలా మంది ఇది మొదటి ప్రచారం జరిగినట్లుగానే ఆ ఏజెంట్ యొక్క జీవిత చరిత్ర అన్నట్లుగా మాట్లాడుతున్నారు, కానీ ఇప్పటికీ దర్శకుడు ఆ ఏజెంట్ కి ఈ సినిమాలో చూపించిన ఏజెంట్ కి సంబంధం లేదు అన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇంకా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చాలామంది పాత్రలను ఈ సినిమాలో కాస్త పేర్లు మార్చి చూపించడం జరిగిందని కూడా సినిమా చూసినవారు అంటున్నారు. ఇండియన్ ఆర్మీ గొప్పతనం, పాకిస్తాన్ ఎలా ఇండియాకు భయపడుతుంది అనేది ఈ సినిమాలో చక్కగా చూపించి ప్రతి ఒక్క దేశభక్తుడు తల ఎత్తుకునే విధంగా చేశారు అంటూ సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాలో ఏముంది అనే ఆసక్తి కలుగుతోంది. అందుకే రోజు రోజుకు సినిమా కలెక్షన్స్ పెరుగుతున్నాయి అనేది బాక్సాఫీస్ వర్గాల వారి అభిప్రాయం. లాంగ్ రన్ లో ఈ సినిమా ఖచ్చితంగా రూ.300 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
