Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్‌'లో ఆ 'బ‌డే సాహ‌బ్' ఎవ‌రు?

ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అత‌ని క‌ళ్ల ముందే పాక్ ఐఎస్ ఐ, టెర్రిస్టులు, గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసి ఇండియాపై ఎలాంటి కుట్ర‌లు ప‌న్నారు? ఆ త‌రువాత ఏం జ‌రిగింది?

By:  Tupaki Entertainment Desk   |   21 Dec 2025 4:00 PM IST
ధురంధ‌ర్‌లో ఆ బ‌డే సాహ‌బ్ ఎవ‌రు?
X

ర‌ణ్‌వీర్‌సింగ్ వ‌రుస ఫ్లాపుల త‌రువాత `ధురంధ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. ట్రూ ఈవెంట్స్ నేప‌థ్యంలో ప‌క్కా స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబ‌ర్ 5న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి క‌లెక్ష‌న్‌ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.800 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని షాక్‌కు గురి చేస్తోంది.

దాయిది దేశం పాకిస్థాన్ దురాగ‌తాల‌కు విసిగిపోయిన భార‌త ఇంటెలిజెన్స్ పాక్‌ను, అది పెంచి పోషిస్తున్న టెర్ర‌రిజాన్ని, ఆయుధాలు స్మ‌గ్లింగ్ చేస్తున్న మాఫియాని టార్గెట్ చేస్తూ ఓ లాంగ్ ట‌ర్మ్ సీక్రెట్ ఆప‌రేష‌న్‌ను పూనుకుంటుంది అదు `ధురంధ‌ర్‌`. ఇందు కోసం ఓ ఏజెంట్‌ని పాక్‌లోకి దించుతుంది. ఓ సాధార‌ణ వ్య‌క్తిగా ఇండియ‌న్ ఏజెంట్‌ని హంమ్జాగా దించి అత‌న్ని మెల్ల మెల్ల‌గా ల్యారీని కంట్రోల్ చేస్తున్న గ్యాంగ్‌స్ట‌ర్ స‌ల్మాన్ బ‌లోచ్ గ్యాంగ్‌లోకి ఎంట‌ర‌య్యేలా చేస్తుంది.

ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అత‌ని క‌ళ్ల ముందే పాక్ ఐఎస్ ఐ, టెర్రిస్టులు, గ్యాంగ్‌స్ట‌ర్స్ క‌లిసి ఇండియాపై ఎలాంటి కుట్ర‌లు ప‌న్నారు? ఆ త‌రువాత ఏం జ‌రిగింది? వ‌ఆరి మ‌ధ్యే ఉంటూ అన్నీ గ‌మ‌నించిన ఇండియ‌న్ రా ఏఎంట్ వారిపై ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన వాస్త‌వ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో అత్యంత అథెంటిక్‌గా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్‌. అందుకే ఈ సినిమా ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది.

ఇదిలా ఉంటే `ధురంధ‌ర్ 2`పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ రుగుతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలోనే అస‌లు క‌థంతా ఉంటుంద‌ని, స‌ల్మాన్ బ‌లోచ్‌ని హ‌త్య చేసిన హ‌మ్జా (రా ఏజెంట్‌) మిగ‌తా గ్యాంగ్ స్ట‌ర్ల‌ని, ఐఎస్ ఐ ఏజెంట్‌ల‌ని, టెర్ర‌రిస్ట్‌ల‌ని ఒక్కొక్క‌రిగా ఎలా అంత‌మొందించాడు? పార్ట్ 2లో మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ దావూద్ ఇబ్ర‌హీం పాత్ర ఏంటీ? అత‌నితో పాటు అజ‌ర్ మ‌సూద్ క‌థేంటి? వీరి క్యారెక్ట‌ర్ల‌ని ఆదిత్య‌ధ‌ర్ ఎలా చూపించ‌బోతున్నాడు? పార్ట్ 1 ఎండింగ్‌లో హ‌మ్జా డైరీలో రాసిన `బ‌డే సాహ‌బ్` ఎవ‌రు? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `బ‌డే సాహ‌బ్` అంటే దావూద్ ఇబ్ర‌హీమా? .. లేక అజ‌ర్ మ‌సూదా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వేళ దావూద్ ఇబ్ర‌హీమ్ అయితే అత‌ని క్యారెక్ట‌ర్‌లో ఎవ‌రిని చూపిస్తారు? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.