నాగవంశీ 'పుష్ప' కామెంట్స్.. మళ్లీ ఆ రచ్చ ఎందుకు?
దీంతో అప్పట్లో ఆ కామెంట్ బాలీవుడ్ లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. టాలీవుడ్ మూవీ లవర్స్ అంతా నాగవంశీకి సపోర్ట్ గా నిలిచారు.
By: M Prashanth | 8 Jan 2026 12:00 PM ISTటాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారన్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలతోనే కాకుండా.. తనదైన కామెంట్స్ తో ట్రెండింగ్ లో నిలుస్తుంటారు. అయితే గతంలో ఒక రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొని పుష్ప 2 గురించి మాట్లాడుతూ, ఒక రోజులో రూ.80 కోట్లకు పైగా రాబట్టడంతో ఆరోజు ముంబై మొత్తం నిద్రపోయిందనుకోనంటూ వ్యాఖ్యానించారు.
దీంతో అప్పట్లో ఆ కామెంట్ బాలీవుడ్ లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. టాలీవుడ్ మూవీ లవర్స్ అంతా నాగవంశీకి సపోర్ట్ గా నిలిచారు. బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం ఫైర్ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అంతా సైలెంట్ అయ్యారు. కానీ ధురంధర్ మూవీ రిలీజ్ అయ్యాక.. మళ్లీ నాగవంశీ చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ తో పాటు ఆయనపై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో రూపొందిన ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన విడుదలైంది. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ మూవీ.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1220 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో కొత్త రికార్డులు కూడా క్రియేట్ చేసింది.
అయితే కొన్ని రోజుల క్రితం కొందరు బీటౌన్ ఎక్స్ యూజర్స్.. దురంధర్ విజయాన్ని ప్రస్తావిస్తూ నాగ వంశీ పాత వ్యాఖ్యలను గుర్తు చేశారు. అంతే కాదు.. ఆయన ఫోటోతో ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ? అంటూ క్వశ్చన్ చేశారు. దీంతో ఆ పోస్ట్‌పై బాలీవుడ్ స్టార్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఎక్కడో నిద్ర పట్టక బాధపడుతున్నాడంటూ రిప్లై ఇచ్చారు.
అప్పట్లో ఆ విషయం వైరల్ గా మారగా.. ఇప్పుడు పుష్ప పేరిట ఉన్న హిందీ బాక్సాఫీస్ రికార్డు ధురంధర్ బద్దలు కొట్టడంతో బాలీవుడ్ నెటిజన్లు నాగ వంశీ పాత వ్యాఖ్యలను మళ్లీ ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనను ట్యాగ్ చేస్తున్నారు. నాగవంశీతోపాటు తెలుగు చిత్ర నిర్మాతలు అంతా ఇప్పుడు నిద్ర కోల్పోతున్నారా అంటూ పోస్టులు పెడుతున్నారు.
దీంతో అవి వైరల్ అయ్యి బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లు పరిస్థితి క్రియేట్ చేసింది. నాగవంశీ పాత వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాల్లో ఉన్న కోపం ఇప్పటికీ తగ్గనట్లు కనిపిస్తోంది. ఏదేమైనా ఇప్పటికే ఆయన కామెంట్స్ చేసి చాలా నెలలు అవుతుండగా.. మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురావడం అవసరమా అంటూ టాలీవుడ్ మూవీ లవర్స్ హితవు పలుకుతున్నారు. దీంతో నాగవంశీ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి.
