Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్ 3' నేను సైతం అంటోన్న సీనియ‌ర్!

స్పై థ్రిల్లర్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌ప్పుడు బాలీవుడ్ కే ప‌రిమిత‌మైన స్పై థ్రిల్ల‌ర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   20 April 2026 2:00 PM IST
ధురంధ‌ర్ 3 నేను సైతం అంటోన్న సీనియ‌ర్!
X

స్పై థ్రిల్లర్ సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌ప్పుడు బాలీవుడ్ కే ప‌రిమిత‌మైన స్పై థ్రిల్ల‌ర్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. దీంతో అంత‌కంత‌కు స్పై థ్రిల్ల‌ర్ల‌పై ఆస‌క్తి పెరుగుతుంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురంధర్` ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. రెండు భాగాలు క‌లిపి మూడు వేల కోట్ల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డు న‌మోదు చేసింది.

ఈ నేప‌థ్యంలో `ధురంధ‌ర్ 3` ఉంటుందా? ఉండ‌దా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేష్ బేడీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ స‌హా నెటి జ‌నుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ చిత్రంలో రాకేష్ బేడీ పాకిస్థానీ రాజకీయ నాయకుడు జమీల్ జమాలీగా తనదైన నటనతో మెప్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాను కూడా మూడవ భాగం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు మాత్రమే కాదు. ఇందులో న‌టించిన‌ నటీనటులు కూడా ఫ్రాంచైజీ కథా గమనంపై ఆసక్తిగా ఉన్నారనే విషయాన్ని రాకేష్ బేడీ మాట‌లు స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది దర్శకుడు ఆదిత్య ధర్ మాత్రమేనన్నారు. ఒక ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్లడం అనేది కేవలం నటుల ఆసక్తిపైనే కాకుండా? దర్శకుడి విజన్ , కథలో ఉన్న బలంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఆదిత్య ధర్ ఈ దిశగా ఏవైనా ఆలోచనలు చేస్తున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. కథ పరంగా చూస్తే `ధురంధర్ 2` ముగింపు, అందులోని పోస్ట్-క్రెడిట్ సీన్స్ ప్రేక్షకులకు ఒక రకమైన ముగింపునిచ్చినట్లు అనిపిస్తాయి. ప్రధాన ఘర్షణ ముగిసినట్లుగా దర్శకుడు చూపించినా? స్పై థ్రిల్లర్లలో ఊహించని మలుపులుంటాయి. పోస్ట్-క్రెడిట్ సన్నివేశాల్లోని చిన్న చిన్న లూప్ హోల్స్, కథను మరో కొత్త కోణంలోకి మళ్లించేందుకు ఆస్కారం కల్పిస్తున్నాయని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

ప్రేక్షకుల నుండి ద‌క్కిన‌ అపారమైన ఆదరణ పార్ట్ 3కి ప్రధాన బలంగా మారే అవకాశం ఉంది. నేటి కాలంలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే, సీక్వెల్ కోసం డిమాండ్ రావ‌డం సహజం. `ధురంధర్` ఫ్రాంచైజీకి ఉన్న పాన్-ఇండియా అప్పీల్, రణవీర్ సింగ్ నటన ఈ క్రేజ్‌ను రెట్టింపు చేస్తున్నాయి. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆదిత్య ధర్ భవిష్యత్తులో కథలో కొత్త మలుపులను జోడించే అవకాశం ఉంటుందేమో చూడాలి. `ధురంధర్ 3` పై అధికారిక ప్రకటన రాక‌పోయినా? రాకేష్ బేడీ వంటి సీనియర్ నటుల ఆసక్తి , నెట్టింట జరుగుతున్న చర్చలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మూడవ భాగం కార్యరూపం దాల్చితే? అది అంతర్జాతీయ స్థాయి స్పై డ్రామాగా ఉండే అవకాశం ఉంది.