యానిమల్ తర్వాత అంత కర్కశంగా..!
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల కంటే ఎక్కువ. దాదాపు 3 గంటల 5 నిమిషాల నిడివిని కలిగి ఉంది.
By: Sivaji Kontham | 18 Nov 2025 1:00 AM ISTఈరోజుల్లో ఏదైనా సినిమాకి ప్రచారపుటెత్తుగడ చాలా ముఖ్యం. పోస్టర్ -టీజర్- ట్రైలర్ ఏది విడుదలైనా అది కచ్ఛితంగా ప్రేక్షకుల మైండ్ పై ఘాఢమైన ముద్ర వేయాలి. అలా వేయలేకపోతే థియేటర్లకు ప్రజలను రప్పించడం అసాధ్యంగా మారింది. ఇటీవలి కాలంలో యానిమల్, స్త్రీ 2, కాంతార 2 లాంటి చిత్రాలు మాత్రమే జనాల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. అయితే యానిమల్ తరహాలో మళ్లీ అలాంటి ముద్ర వేస్తున్న ఒక సినిమా బాలీవుడ్ లో ఒకటి ఉంది. రాజమౌళి- వారణాసి, నితీష్ తివారీ- రామాయణం1 సినిమాలను మినహాయిస్తే ఈ సినిమాని ఒక చూపు చూడాలి అనిపించేలా మ్యాటర్ కనిపిస్తోంది. అది రణవీర్ సింగ్ నటించిన ధురంధర్. యూరి ఫేం ఆధిత్యధర్ ఈ చిత్రాన్ని అత్యంత ఛాలెంజింగ్ గా తీసుకుని మరీ తెరకెక్కిస్తున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కి అద్భుత స్పందన వచ్చింది. రణ్ వీర్ సింగ్ సింహంలా శత్రువుపై విరుచుకుపడుతున్న విజువల్స్ మోతెక్కించాయి. మాస్ కి భారీ యాక్షన్ ట్రీట్ ఖాయమైందని అంతా భావించారు.
అందుకే ఇప్పుడు అందరి దృష్టి `ధురంధర్` పైనే ఉంది. ట్రైలర్ ఎప్పుడొస్తుందో చూడాలనే ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సినిమా నవంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా దిల్లీ టెర్రర్ బ్లాస్టులు సహా రకరకాల కారణాలతో నవంబర్ 18 కి ట్రైలర్ లాంచ్ వేడుక వాయిదా పడింది. ట్రైలర్ టీజర్ లాగా ఉత్కంఠభరితంగా ఉంటుందో లేదో చూడాలంటే ఇంకా కొన్ని గంటలు సమయం పడుతుంది.
ట్రైలర్ రాక ముందే ఈ సినిమా నిడివి గురించి కూడా ఆసక్తికర చర్చ మొదలైంది. ఇది కూడా రణబీర్- సందీప్ రెడ్డి వంగాల యానిమల్ తరహాలో ఎగ్జయిట్ చేసే సన్నివేశాలతో సుదీర్ఘ నిడివితో రానుందని తెలిసింది. యానిమల్ ఓటీటీలో 3గం.ల 21 నిమిషాల నిడివిని కలిగి ఉంది.. పెద్ద తెరపైనా ఇంచుమించు అంతే నిడివితో సాగింది. అయినా ఎక్కడా విసుగు తెప్పించలేదు ఈ సినిమా.
ఇప్పుడు `ధురంధర్` నిడివి కూడా అలానే ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి ఎంచుకున్న కాన్సెప్ట్ అలాంటిది. ఒక రియల్ హీరో కథను తెరపై చూపిస్తున్నారు ఆధిత్య ధర్. రణవీర్ సింగ్ పాత్ర, అతడు దేనిని ఎదుర్కొంటాడు? అనేది ఎగ్జయిట్ చేస్తుందని చెబుతున్నారు. ఇందులో అక్షయ్ ఖన్నా సహా ఇతర కీలక పాత్రల్లో దిగ్గజ నటులు కనిపిస్తారు. ఇది అద్బుతమైన పెర్ఫామెన్సెస్‌తో సాగే సినిమా. దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమా స్క్రీన్ ప్లేలోనే చాలా మ్యాజిక్ చేయదలిచాడు. ఇది యాక్షన్ ప్యాక్డ్ సినిమా. యానిమల్ తరహాలో కర్కశంగా మీదపడే వాడి కథ. అయితే కథనం త్వరత్వరగా పరిగెత్తకుండా, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు లోను చేయాలనే తపనతో రచనలో చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసారని తెలుస్తోంది.
తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల కంటే ఎక్కువ. దాదాపు 3 గంటల 5 నిమిషాల నిడివిని కలిగి ఉంది. ఆదిత్య ధర్, జియో స్టూడియోస్, బి 62 స్టూడియోస్ సంయుక్తంగా దీనిని నిర్మించాయి. నిజానికి ఇది 185 ని.ల నిడివితో రణ్ వీర్ కెరీర్ లోనే సుదీర్ఘ నిడివి ఉన్న చిత్రంగా రికార్డులకెక్కుతుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు నటించారు. సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా అర్జున్ కూడా ఇందులో ఒక పాత్రలో నటించారు. నవంబర్ 18న జరిగే ట్రైలర్ లాంచ్ లో సంజయ్ దత్ మినహా అందరు తారలు పాల్గొంటారని తెలిసింది.
