Begin typing your search above and press return to search.

ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ లో స్టార్ డైరెక్ట‌ర్ వైఫ్!

ఇదే నిజ‌మైతే? యామీ గౌత‌మ్ కి మంచి రోల్ ప‌డిన‌ట్లే. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రెండ‌వ సారి యామీ ప‌ని చేస్తున్న‌ట్లు అవుతుంది.

By:  Srikanth Kontham   |   4 Jan 2026 4:00 AM IST
ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ లో స్టార్ డైరెక్ట‌ర్ వైఫ్!
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'ధురంధ‌ర్' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 1200 కోట్ల వ‌సూళ్ల‌తో హిందీ చిత్రాల్లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పింది. చాప్ట‌ర్ల వైజ్ గా చూపించినా ప్ర‌తీ పాత్ర హైలైట్ గా నిలిచింది. అక్ష‌య్ ఖాన్నా, ర‌ణ‌వీర్ సింగ్, మాధ‌వ‌న్ స‌హా సినిమాలో చిన్న చిన్న పాత్ర‌లు అంతే సైతం ర‌క్తి క‌ట్టించాయి. ఎంతో బ్యాలెన్సింగ్ ఆ పాత్ర‌ల‌ను ఆవిష్క‌రించిన తీరు ప్ర‌శంసనీయం. త‌దుప‌రి భాగం 'ధురంధ‌ర్2' మార్చి 19న రిలీజ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దీంతో కంటున్యూటీ ఎలా ఉంటుంది? అన్న దానిపై స‌ర్వాత్ర ఆస‌క్తి నెల‌కొంది.

అద‌నంగా కొత్త పాత్రలు పార్ట్ 2 లో యాడ్ అవుతాయి. మొద‌టి భాగంలో వ‌దిలేసిన లీడ్స్ కు కంటున్యూటీ ఉంటుంది. అయితే రెండవ భాగాన్ని త‌దుప‌రి చాప్ట‌ర్ల‌గా కొన‌సాగిస్తాడా? కొత్త చాప్ట‌ర్ల‌తో ముందుకు తీసుకెళ్తాడా? అన్న‌ది చూడాలి. ఈ నేప‌థ్యంలో 'ధురంధ‌ర్ 2' లో ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ స‌తీమ‌ణి, హీరోయిన్ యామీ గౌత‌మ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని బాలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. పాకిస్థాన్ ఎపిసోడ్స్ లో యామీ పాత్ర క‌నిపిస్తుంద‌ని...హీరోకి ధీటుగా ఆ రోల్ ఉంటుంద‌ని వార్త‌లొస్తున్నాయి.

ఇదే నిజ‌మైతే? యామీ గౌత‌మ్ కి మంచి రోల్ ప‌డిన‌ట్లే. ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రెండ‌వ సారి యామీ ప‌ని చేస్తున్న‌ట్లు అవుతుంది. ఆదిత్యధ‌ర్ తొలి సినిమా 'యూరి'లో యామీ గౌత‌మ్ కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆర్మీ నేప‌థ్యంలో వ‌చ్చే కొన్ని కీల‌క స‌న్నివేశాల్లో యామీ గౌత‌మ్ క‌నిపిస్తుంది. ఆ సినిమా త‌ర్వాత యామీ గౌత‌మ్ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో న‌టించింది. క‌నీసం ఓ ప‌ది సినిమాలైనా చేసి ఉంటుంది. కానీ ఆవేవి పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. 'బాల‌', 'జిన్నీ వెడ్స్ స‌న్నీ', 'బూత్ పోలీస్', ' ఏ త‌ర్స్ డే', 'ద‌స్వీ', 'లాస్ట్', 'చోర్ నిక‌ల్ కే భాగ్', ఓ 'మైగాడ్ 2' , 'ఆర్టిక‌ల్ 370', 'దూమ్ ధామ్' లాంటి చిత్రాల్లో న‌టించింది.

'ఆర్టిక‌ల్ 370', 'బూత్ పోలీస్' చిత్రాలు యావ‌రేజ్ గా ఆడాయి. ఈ నేప‌థ్యంలో 'ధురంద‌ర్ 2' తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తుందేమో చూద్దాం. 'యూరి' రిలీజ్ అనంత‌ర‌మే ఆదిత్య ధ‌ర్ -గౌత‌మ్ వివాహం చేసుకున్నారు. ఆ దంప‌తుల‌కు ఓ కుమారుడు కూడా క‌ల‌డు. వివాహం అనంత‌రం యామీ గౌత‌మ్ చాలా సెల‌క్టివ్ గా సినిమాలు చేస్తోంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు యామీ తొలి నుంచి దూరంగానే ఉంది. ఆమెపై క్లీన్ ఇమేజ్ ఉంది.